Advertisement
Google Ads BL

శృతి హాసన్ ఇలా తయారయ్యిందేంటి?


సెలబ్రిటీలు ఏమి చేసినా అది మీడియాకు, జనాలకు ఆసక్తికరమైన విషయమే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో జుట్టు నుంచి బొట్టుదాకా, మోము నుంచి బొడ్డు దాకా, వారు వేసే డ్రస్సుల నుంచి వారి పర్సనల్‌ విషయాల వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఉబలాటపడుతుంటారు. ఇక ఇప్పుడు శృతిహాసన్‌ విషయానికి వస్తే ఈమె నిన్నమొన్నటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలు చేస్తూ గడిపింది. ఇక తన ప్రియుడితో ఎఫైర్‌, 'సంఘమిత్ర' చిత్రం నుంచి వైదొలడగం వరకు ఎన్నో వార్తలు షికారు చేశాయి. 'సంఘమిత్ర' కోసం కాస్త ఒళ్లు వంచి కత్తి విన్యాసాలు, ఇతర యుద్ద సన్నివేశాలు, గుర్రపు స్వారీ వంటివి బాగా చేయడంతో బాగానే అమ్మడు ఫిట్నెస్‌తోనే కనిపించింది. 'కాటమరాయుడు'లో అగ్లీలుక్‌తో కనిపించి విమర్శలు మూటగట్టుకున్న ఆమె 'సంఘమిత్ర'తో మరలా సన్నబడుతుందని భావించారు. కానీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో విడుదల చేసి ఆ వేడుకలో అంతా తానై వ్యవహరించింది. కానీ ఈ చిత్రం నుంచి ఆమె చివరి నిమిషంలో తప్పుకుంది. 

Advertisement
CJ Advs

దానికి ఆమె చెప్పిన కారణం ఏమిటంటే.. తాను పలు భాషల్లో చిత్రాలు చేయాల్సివుందని, కాబట్టి 'సంఘమిత్ర'కి చాలా రోజులు బల్క్‌ కాల్షీట్స్‌ ఇవ్వడం కుదరలేదని చెప్పుకొచ్చింది. కానీ ఈమె చెప్పింది అబద్దమే అని తేలింది. ఆమె ప్రస్తుతం తన తండ్రి తీస్తున్న 'శభాష్‌నాయుడు'లో తప్ప దేనిలో నటించడం లేదు. 'శభాష్‌నాయుడు' షూటింగ్‌ జరుగుతోందో లేదో కూడా తెలియదు. స్వతహాగా ఈమె భోజన ప్రియురాలు. తన తండ్రి లాగానే తాను అన్ని దేశాలలోని రుచులను అన్నీ చూశానని, ప్రతి జంతువు మాంసం తిని ఉన్నానని, కేవలం కొన్ని పద్దార్ధాలు తినడానికే విదేశాలకు వెళ్తుంటానని చెప్పంది. ఇక ఆమె ఈ మధ్యబాగా మద్యానికి కూడా బానిసై బోయ్‌ప్రెండ్‌తో ఎఫైర్‌లో మునిగితేలుతోంది. దీంతో ఈ గ్యాప్‌లో సన్నగా నాజూకుగా ఉండే ఆమె భారీ సైజులను సంతరించుకుంది. 

ఇటీవల ఓ దుకాణం ఓపెనింగ్‌కి వచ్చిన ఆమెని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. సీనియర్‌ హీరోయిన్లయిన తమన్నా, శ్రియ, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారు తమ ఫిట్నెస్‌ని మెరుగులు దిద్దుకుని ఇప్పటికీ రాణిస్తుంటే శృతి మాత్రం ఆంటీలా తయారైంది. అయినా తమిళంలో భారీగా ఉండే నాటి జయలలిత నుంచి ఖుష్భూ, నమిత, హన్సిక వంటి వారికి మంచిక్రేజ్‌ ఉన్నట్లు ఈమె రాబోయే రోజుల్లో కోలీవుడ్‌ని ఆకట్టుకుంటుందేమోచూడాలి..! దీనిని చూస్తే చక్కనమ్మ చిక్కినా అందమే.. ముద్దుగుమ్మ బొద్దుగా మారినా అందమే అనే సామెతలతో పాటు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా బాగుంటుంది  అన్నట్లుగా భారీ అందాలతో కూడా ఈమె వార్తల్లో నిలుస్తోంది. 

Shruthi Haasan In Aunty Look:

Shruthi Haasan Latest Look Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs