Advertisement
Google Ads BL

వేషాలు, డ్రస్‌లే కాదు.. ఈమె టేస్ట్ కూడా మాసే!


బుల్లితెర మీదనే కాదు.. పలు చిత్రాలలో, మరీ ముఖ్యంగా 'గుంటూరు టాకీస్‌' చిత్రంలో తన అందాలను ఆరబోసిన హాట్‌ యాంకర్‌ రేష్మి. ఈమె నటించే క్యారెక్టర్స్‌, కాస్ట్యూమ్స్‌, చూపులే కాదు... ఆమె అభిరుచి కూడా పక్కామాసేనని ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ పాత పాటలంటే తనకెంతోఇష్టమని, పాత పాటలు అద్భుతంగా ఉంటాయని సెలవిచ్చింది. దాంతో పాతపాటలంటే ఆహ్లాదకరంగా ఉండే ఘంటసాల పాటలో, లేక ఏసుదాస్‌పాటలో, ఎస్పీబాలు పాడిన పాత ఆణిముత్యాలో, అందిరినీ కట్టిపడవేసే ఇళయరాజా, కె.విశ్వనాథ్‌ వంటి వారి సాంగ్స్‌ అనుకుంటే మనం తప్పులోనే కాదు.. పప్పులోనూ కాలువేసినట్లే. ఇక తనకు చిరంజీవి చిత్రంలోని పాట అనేసరికి ఏ 'స్వయంకృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు, రుద్రవీణ, లేక ఆయన మెగాస్టార్‌ అయ్యే క్రమంలో ఇళయరాజా చిత్రాలలోని పాటలనుకుంటే అదీ కాదట'....!

Advertisement
CJ Advs

ఆమెకు 'ఘరానా మొగుడు'లోని 'ఏంటిబే ఎట్లాగా ఉంది ఒళ్లు.. ఎక్కడో గుచ్చావు చేపముల్లు' పాట చాలా ఇష్టమని చెప్పడమేకాదు.. ఆ పాటను పాడి మరీ వినిపించింది.'ఘరానా మొగుడు'లోని ఈ పాటలో నాడు ద్వందార్ధాలున్నాయని నాడే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా రేష్మి అభిరుచిని ఆమెకు నచ్చిన పాట బయటపెడుతోంది. అంతేకాదు.. తాను ఇప్పటికీ పిల్లలలాగా 'పోకేమాన్‌' ఆడుతుంటూ ఉంటానని తనకు ఆ గేమ్‌ అంటే భలే ఇష్టమని చెప్పింది. తనది కూడా చిన్నపిల్లల మనస్తత్వమేనని ఆమె చెప్పడం చూస్తే చిన్నపిల్లలాగా'పోకేమాన్‌' ని ఆడే ఈ భామకు అంత బూతుపాట ఎలాఇష్టమో? అనే సందేహం వస్తుంది. 

ఇక ఆమె వి4 బేనర్‌లో ఈటీవీ ప్రభాకర్‌ దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన హర్రర్‌ ఎంటర్‌టైనర్‌ 'నెక్ట్స్‌ నువ్వే'చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఆమె హీరో ఆది, దర్శకుడు ప్రభాకర్‌తోపాటు నిర్మాతలను మించి ప్రమోషన్‌ చేస్తోంది. దాంతో చాలామంది పాత్ర చిన్నదైనా సరే ప్రమోషన్స్‌ మాత్రం భారీ రేంజ్‌లో చేస్తోందని, మరి ఈ ప్రమోషన్‌ దర్శకనిర్మాతల సూచనల మేరకా? లేక తానే ముందుకొచ్చి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. 

Rashmi Gautam liks Chiranjeevi Gharana Mogudu Song:

Rashmi Gautam Mass Interest Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs