త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న NTR 28 సినిమా అధికారికంగా మొదలైంది. కానీ పవన్ సినిమా షూటింగ్ పూర్తికాని కారణంగా ఎన్టీఆర్ సినిమాని ఇప్పట్లో దర్శకుడు త్రివిక్రమ్ మొదలుపెట్టలేకపోతున్నాడు. పవన్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీటితో బిజీగా వుండే త్రివిక్రమ్... పవన్ తో తాను తీస్తున్న సినిమాని సంక్రాతి కానుకగా జనవరి 10 న విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ లోపు ఎన్టీఆర్ సినిమాకి సంబందించిన నటీనటుల ఎంపికతోపాటు టెక్నీషియన్స్ ఎంపిక కూడా త్రివిక్రమ్ పూర్తి చెయ్యనున్నాడట.
ఇంతకుముందు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో అను ఇమ్మాన్యువల్ ని దర్శకుడు త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు 'దువ్వాడ జగన్నాథం' భామ పూజ హెగ్డే ని ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సెలెక్ట్ చేసే యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అలాగే పూజ తో పాటే అనుపమ పరమేశ్వరన్ పేరుని కూడా ఎన్టీఆర్ కోసం పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ ని తీసుకోవాలా? లేకుంటే అనుపమని తీసుకోవాలా? అనే డైలమాలో చిత్ర బృందంతోపాటే తివిక్రమ్ ఉన్నాడట. ఇకపోతే ఇప్పటివరకు ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తప్ప మరే ఇతర టెక్నీషియన్స్ ని ఈ సినిమా కోసం తీసుకోలేదు.
ఇక ఈ సినిమాలో పూజ కి ఎన్టీఆర్ సరసన ఛాన్స్ నిజమైతే ఆమె నక్కతోక తొక్కినట్లే... 'డీజే' లో అవసరానికి మించి అందాల ఆరబోతకు దిగిన పూజకి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'సాక్ష్యం' సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే పూజ మాత్రం స్టార్ హీరో పక్కన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. మరోపక్క యంగ్ హీరోల పక్కన నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అనుపకి ఛాన్స్ వచ్చినా సూపర్. ఎందుకంటే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోపక్కన ఛాన్స్ అంటే అనుపమ కి అదృష్టం పెట్టినట్లే మరి. చూద్దాం ఫైనల్ గా ఎవరు ఎన్టీఆర్ పక్కన నటిస్తారో..?