Advertisement
Google Ads BL

గ్లామర్‌ పాత్రలకు రెడీ అంట! యూజ్ చేసుకోండి!


ఎవరో నిత్యామీనన్‌, కీర్తిసురేష్‌ వంటి వారు తప్పితే మిగిలిన హీరోయిన్లు మొదట్లో పద్దతిగా కనిపించి, అవకాశాలు, స్టార్‌ హీరోల దృష్టి పడకపోవడం చూసితర్వాత బాగానే గ్లామర్‌కి హద్దులు చెరిపేసి పాత్ర డిమాండ్‌ చేసిందనో, ఆ సీన్‌లో అలా చేయాల్సివుందని చెబుతూ గ్లామర్‌ పాత్రలకు ఓకే చెబుతారు. వారిలో కాజల్‌, సమంత, రాశిఖన్నా వంటి వారు ఎందరో ఉన్నారు. ఇక తాను నటించిన చిత్రాలన్ని హిట్‌ కావడంతో కేరళకుట్టి అయిన అనుపమ పరమేశ్వరన్‌ గోల్డెన్‌ లెగ్‌ అని పేరు తెచ్చుకుంది. కానీ పెద్దస్టార్స్‌ సరసన అవకాశాలు రాలేదు. స్టార్‌ హీరోలు పట్టించుకోవడం లేదు. సాయిపల్లవి లానే ఈమె కూడా ఎక్స్‌పోజింగ్‌ చేయదేమో అనే అనుమానంతో మేకర్స్‌ వేరే వారివైపు చూస్తున్నారు. మరోవైపు ఆమె హైట్‌ తక్కువగా ఉండటం కూడా ఆమె అవకాశాలకు అడ్డుపడుతోంది. దీంతో ఈ అమ్మడు కూడా ఇప్పుడు డైరెక్టర్లు తన పాత్ర పట్ల క్లారిటీతో ఉండి, నన్ను మెప్పించగలిగితే గ్లామర్‌ పాత్రలు కూడా చేస్తానని టాలీవుడ్‌లోని అందరికీ తన ఉద్దేశ్యాన్ని చెప్పేసింది. 

Advertisement
CJ Advs

కథనే హీరోగా భావిస్తాను.. కంటెంట్‌ బాగా ఉంటే తర్వాత నా పాత్ర గురించి ఆలోచిస్తాను. ఈ రెండు నచ్చాయంటే సినిమాలకు ఓకే చెబుతానని చెప్పింది. ఇక ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఒకటే సారి రెండు చిత్రాలలో నటించనని, ఒక సమయంలో ఒకే పాత్ర అయితేనే కంఫర్టబుల్‌గా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఆ స్టేట్‌మెంట్‌ని కూడా పక్కనపెట్టి నానితో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్దం', సాయిధరమ్‌తేజ్‌- కరుణాకరన్‌ చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమె తన ఇంట్లో వారెవ్వరికి సినీఇండస్ట్రీ గురించి తెలియదని, తాను మద్యతరగతి వ్యక్తినని, కాబట్టి కుటుంబంతో కూడా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తానని చెప్పింది. 

ఇక 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలో తన పాత్రకు ఎంతో పేరు వచ్చిందని, అందంగా ఉన్నావు.. మంచి టాలెంట్‌ చూపావని తన గత చిత్ర దర్శకులు, నెటిజన్లు చెబుతున్నారని, ఈ పాత్ర చివరికి చనిపోతుందని డైరెక్టర్‌ కిషోర్‌తిరుమల చెబితే జోక్‌ అనుకున్నానని, కానీ దర్శకుడు తనను కన్విన్స్‌ చేయగలిగాడని అంటోంది. ఈ మహా పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, అందరూ తన పాత్ర గురించే మాట్లాడుతున్నారని అంటోన్న ఈ భామ కూడా ఇక తప్పక తన నియమాలు, నిబంధనలను పక్కనపెట్టిందనే చెప్పాలి.

Anupama Parameswaran Ready to Glamour Roles:

Anupama Parameswaran Sensational Decision on Glamour Roles
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs