Advertisement
Google Ads BL

'గృహం'తో ఈ అమ్మడి గ్రహం మారుతుందా?


కొంతమంది హీరోయిన్లకు టాలెంట్‌ లేకపోయినా గ్లామర్‌షో చేస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరికొందరికి మంచి హిట్‌ సినిమా పడితే అవకాశాలు వస్తాయి. కానీ కొందరికి మాత్రం విజయాలు, టాలెంట్‌ ఉన్నా కూడా అవకాశాలు రావు. ఇందులో నాటి ఎన్టీఆర్‌ 'ఆది', అల్లుఅర్జున్‌ 'ఆర్య' చిత్రాలలో నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇక అవికాగోర్‌-హెబ్బాపటేల్‌, నిత్యామీనన్‌లు కూడా అదేకోవలోకి వస్తారు. ఇక నిఖిల్‌ నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే బ్లాక్‌బస్టర్‌ మూవీలో నటించి, అందరి ప్రశంసలు అందుకున్న కన్నడ నటి నందితాశ్వేతకి కూడా తరువాత తెలుగులో మరో అవకాశం రాలేదు. అదేకోవకి చెందిన నటి ఆండ్రియా. 

Advertisement
CJ Advs

సాధారణంగా కమల్‌హాసన్‌ని మెప్పించడం చాలా కష్టం. అందునా ఆయన చిత్రాలలో ఆయన లిప్‌లాక్‌ సీన్లకు ఒప్పుకోవడం కూడా సాహసమే. కానీ కమల్‌తో 'విశ్వరూపం1', 'ఉత్తమవిలన్‌', 'విశ్వరూపం2'లలో నటించిన ఈ అమ్మడు తెలుగులో నాగచైతన్య, సునీల్‌లు హీరోగా వచ్చిన 'తడాఖా' చిత్రంలో సునీల్‌కి జతగా నటించింది. ఈచిత్రం కూడా విజయం సాధించింది. ఇక పదేళ్ల కెరీర్‌ ఉన్నప్పటికీ, బికినీలు, లిప్‌లాక్‌లకు ఓకే అన్నా కూడా ఆమెకి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక ఆమె నటించిన 'తారమణి' చిత్రంలో ఆమె పాత్రకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కానీ ఆ చిత్రం తర్వాత తనకు మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూసినా రాలేదని ఆమె బాధపడుతోంది. ఇక కమల్‌హాసన్‌ తర్వాత తనకు కంఫర్టబుల్‌గా అనిపించిన హీరో సిద్దార్ద్‌ అని చెబుతోంది. ఆమె ప్రస్తుతం సిద్దార్ధ్‌ హీరోగా, స్వీయ నిర్మాణంలో మిలింద్‌ దర్శకత్వం వహించిన 'గృహం' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్‌ 3న తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

సాధారణంగా ఇప్పుడొస్తున్న హర్రర్‌ కామెడీ చిత్రాల తరహాలో కాకుండా బాలీవుడ్‌ ఎరోటిక్‌ సినిమాల తరహాలో శృంగారంతో కూడిన హర్రర్‌ చిత్రంగా ఇది రూపొందింది. ఇందులోని ఓ పాటలో సిద్దార్ద్‌, ఆండ్రియాలు రెచ్చిపోయి అరడజనుకు పైగా లిప్‌లాక్‌లలో కనిపించారు. ఇక ఆమె తాను ఇంత కెరీర్‌లో మీడియాకు దూరంగా ఉండటం గురించి చెబుతూ, మీడియాతో భేటీలు జరిపేంతగా నేనేమి సాధించలేదు. ఆ స్థాయికి తానింకా ఎదగలేదని ఆమె చెబుతోంది. మరి సిద్దార్ధ్‌ చిత్రమైనా ఆమెకు తమిళ్‌, తెలుగు, హిందీలలో మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Andrea Jeremiah hopes on Siddhartha Gruham movie:

Andrea Jeremiah about Gruham Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs