Advertisement
Google Ads BL

ఆడవాళ్ళమీద పంచ్ వేస్తూ.. కేటీఆర్‌ జోక్..!


నేటి సమాజం బాగా ముందుకెళ్తోంది... అందరూ చైతన్యవంతులు, విద్యావంతులు తయారవుతున్నారని భావిస్తున్నాం గానీ మన సమాజం పాత రోజుల కంటే కొన్ని విషయాలలో బాగా వెనుకబడి ఉంది. నాటి ప్రజలు సినిమాలను, జోక్‌లను కూడా పాజిటివ్‌గా తీసుకుని, స్పందిస్తూ ఉండేవారు. నాటి కాలంలో సినిమాని సినిమాగా, జోక్‌ని జోక్‌గా, మోటు సామెతలను కూడా హాస్యంగా భావించేవారు. కానీ నేటి జనరేషన్‌లో మాత్రం అసూయలు, ద్వేషాలు, సున్నితత్వం.. ఇలా అన్నీ పెరిగిపోతున్నాయి. ప్రతిచిన్న విషయాలకు జనాల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గొడవలు చేసే స్థితి వచ్చింది. ఇక మన సమాజంలో కులాల మీద ఉన్న జోక్‌ల కంటే భార్యల మీద వేసే జోకులు, పెళ్లి విషయంలో మగవారి బాధలను సున్నితంగా స్పృశించే సెటైర్లు ఎన్నో ఉన్నాయి. ఈ మద్య ఓ కార్టూన్‌లో ఓ భర్త తానే వంట చేసి.. భార్యను కారం, ఉప్పు తక్కువైతే చెప్పు. అంతేగానీ నా మీద గృహహింస కేసు మాత్రం పెట్టవద్దని వేడుకుంటున్న జోక్‌ నిజంగా అద్భుతం. ఇప్పుడు అలాంటి ఓ జోక్‌నే తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక ఆయన ముందు జాగ్రత్తగా 'దీనిని మహిళలు సరదాగా తీసుకోండి...దీనిని తప్పుగానో, నేరంగానో భావించవద్దని ముందుచూపు ప్రదర్శించారు'. ఇంతకీ కేటీఆర్‌ షేర్‌ చేసిన పోస్ట్‌లోని జోక్‌ ఏమిటంటే.. 'ఐపాయ్‌ బాబా వద్దకు ఓ భక్తుడు వచ్చి స్వామిజీ... నా తప్పులు, పొరపాట్లు నేను గుర్తించడం ఎలా స్వామి? అని అడుగుతాడు. దానికి ఆ ఐపాయ్‌ బాబా.. నువ్వు ముందుగా నీభార్య చేసిన ఏదైనా తప్పును గమనించి ఆమెను దానిని సరిదిద్దుకోమని చెప్పు, ఆమె ప్రతిస్పందించడం ద్వారా నీ తప్పులే కాదు.... నీ బంధువులు, మీ కుటుంబంలోని వారు. నీ మిత్రులు తప్పులు కూడా గుర్తించవచ్చు..' అనే జోక్‌లో నిజంగానే నిగూడార్ధం ఉంది. అందునా ఇందులోని హాస్యచతురతని చూస్తే బాపు కార్టూన్లు, జంధ్యాల చిత్రాలవంటివి ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఈ జోక్‌ని పెళ్లయిన మగవారు చూస్తే తప్పుకుండా నవ్వుకుంటారని కేటీఆర్‌ తెలిపి, దీనిని నేను షేర్‌ చేయలేకుండా ఉన్నానంటూ తనలోని హాస్యచతురతని చాటుకున్నాడు. అయితే ఇది కేటీఆర్‌కి కూడా స్వీయానుభవమైఉండబంటే ఆయనకు ఇది బాగా నచ్చి ఉంటుందని కొందరు తమాషాగా జోక్స్‌ పేలుస్తున్నారు. 

KTR Shared Joke on Twitter:

KTR Comedy Tweet Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs