రజినీకాంత్ - శంకర్ కలయికలో '2.0' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం '2.0' సినిమా ఆడియో వేడుకని దుబాయ్ వంటి మహానగరంలో నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుక అందరి మతులని పోగొట్టింది. ఆ రేంజ్ లో ఈ వేడుకని దుబాయ్ లో నిర్వహించారు నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా '2.0' సినిమాపై ఒక న్యూస్ వెలుగులోకొచ్చింది. అదేమిటంటే రజినీకాంత్ హీరోగా.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం కేవలం 140 నిమిషాలేనట.
మరి శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ దాదాపు 170 నిమిషాల రన్ టైం కలిగిఉంటాయి. అంత సేపు రన్ టైం ఉన్నప్పటికీ శంకర్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కుర్చీలలో అతుక్కుపోయేటట్లు చెయ్యగల టాలెంటెడ్ పర్సన్. మరి అలాంటి శంకర్ ఇలా '2.0' కి ఇంత తక్కువ రన్ టైం ఫిక్స్ చెయ్యడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ ని బేస్ చేసుకుని శంకర్ ఇలా ప్లాన్ చేశాడని అంటున్నారు. అంతేకాకుండా '2.0' బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో.. ఈ రన్ టైం విషయంలో కాంప్రమైజ్ కావాల్సివచ్చింది అంటున్నారు.
ఒకవేళ నిడివి ఎక్కువ ఉంటే ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడుతుంది కాబట్టే ఇలా నిడివిని దర్శకుడు శంకర్ తగ్గించేశారంటున్నారు. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాలేదని.. అందువలన కూడా డ్యూరేషన్ తగ్గిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది దర్శకుడు శంకర్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.