Advertisement
Google Ads BL

థమన్ ఆనందపడినంతసేపు పట్టలేదు!


 

Advertisement
CJ Advs

కొన్ని గాసిప్ లు కొందరికి బాధకలిగిస్తే మరి కొన్ని గాసిప్ లు కొందరికి ఆనందాన్ని కలుగచేస్తాయి. అందులో భాగంగానే థమన్ పై వచ్చిన ఒక గాసిప్ తనను ఆనందానికి గురి చేసిందంట. మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా 'మహానుభావుడు' సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా విజయంలో మారుతి, శర్వానంద్ కే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి కూడా మంచి పేరు వచ్చింది.

ఈ మధ్య కాలంలో థమన్ మంచి ఫామ్ లో వున్నాడు. వరసపెట్టి హిట్స్ కొడుతున్నాడు. దీంతో మారుతి చేసే నాగ చైతన్య సినిమాకి కూడా థమన్ నే మ్యూజిక్ డైరక్టర్ అని గాసిప్ వచ్చి ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేసింది. ఈ గాసిప్ థమన్ కు మంచి ఆనందాన్ని కలుగచేసిందట. దీంతో థమన్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి చకచకా రీ ట్వీట్ లు చేసినట్టు తెలుస్తుంది.

అసలు విషయం ఏంటంటే.. మారుతి ఈసారి తన సినిమాకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోకుండా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ని తీసుకోవాలని భావిస్తున్నాడట. 'భలే భలే మగాడివోయ్' సినిమాకి మారుతితో కలిసి గోపీ సుందర్ పని చేసి మంచి మ్యూజికల్ హిట్ అందించాడు. దీంతో మళ్ళీ గోపినే తీసుకోవాలని మారుతీ అనుకుంటున్నాడని సమాచారం. ఇప్పుడు ఇది తెలిశాక థమన్ ఉత్సాహం అంతా నీరు కారిపోయిందనే టాక్ వినబడుతుంది. ఓ పెద్ద ప్రాజెక్టు వచ్చిందనుకునే లోపే ఇలా జరగడం నిజంగా తమన్ బాడ్ లాక్ అనుకోవడమే. 

SS Thaman Disappoint with Maruthi Decision:

No Thaman Music to Maruthi and Naga Chaitanya Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs