Advertisement
Google Ads BL

పవన్, ఎన్టీఆర్ పై వస్తున్న ఈ వార్త నిజమేనా?


నిజానికి అభిమానుల మధ్య గొడవలు ఉంటాయే గానీ స్టార్స్‌, హీరోల మధ్య మాత్రం మంచి స్నేహసంబంధాలే ఉంటాయి. చిరంజీవి-బాలయ్య, చిరంజీవి-నాగార్జున, బాలయ్య-రాజశేఖర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ వంటి వారు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక తాజాగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ఎన్టీఆర్‌తో చేయబోయే చిత్రం ప్రారంభోత్సవానికి చీఫ్‌గెస్ట్‌గా పవన్‌ వెళ్లి క్లాప్‌ కొట్టడం, క్లాప్‌ కొట్టిన వెంటనే క్లియర్‌ ది ఫీల్డ్‌లా ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నేలపై కూర్చొవడం, దాంతో ఎన్టీఆర్‌ మనసారా నవ్వుకోవడం, ఎన్టీఆర్‌ కాస్త వినయంగా, పవన్‌ కాస్త సిగ్గరిగా ఆలింగనం చేసుకున్న విషయాలు వారి మధ్య అభిమానాన్ని చాటుతాయి. అప్పుడు అభిమానులు పవన్‌ జిందాబాద్‌ అని, జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేస్తే వారిద్దరు నవ్వులు చిందించారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఓ హీరో ఓ దర్శకుడి చిత్రం చేయకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కథ నచ్చకపోవడం, కథ బాగున్నా ఆ దర్శకుడు ఆ చిత్రాన్ని సరిగా హ్యాండిల్‌ చేయగలడోలేదో అనే అనుమానం.. తనకు ఆ కథ సూట్‌ కాదని వేరే హీరోని సజెస్ట్‌ చేయడం జరుగుతుంటాయి.'2.0' చిత్రం విషయంలో అమీర్‌ఖాన్‌, రజనీల విషయంలో అదే జరిగింది. అదే తరహాలో ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీకి కూడా అదే జరిగిందని అంటున్నారు. పవన్‌తో ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 'అజ్ఞాతవాసి' (ఇంకా ఖరారు చేయలేదు) చిత్రం చేస్తున్నాడు. 

ఈ చిత్రం తర్వాత కూడా త్రివిక్రమ్‌ మరోకథను పవన్‌తోనే చేయాలని భావించి, పవన్‌కి సబ్జెక్ట్‌ కూడా చెప్పాడని, దానికి పవన్‌ కథ అద్భుతంగా ఉంది. కానీ నాకంటే ఎన్టీఆర్‌కి ఈ కథ సూట్‌ అవుతుందని చెప్పిన తర్వాతే ఆ కథ ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయినా పవన్‌కి వచ్చే ఎన్నికలు, జనసేన నిర్మాణం వంటి బిజీ కారణాల వల్ల ఈలోపు మరో చిత్రం చేయడం ఇష్టం లేక, సమయం లేకపోవడంతో ఎన్టీఆర్‌ని సూచించాడా? లేక నిజంగానే తనకి ఆకథ సరిపోదని భావించి ఎన్టీఆర్‌ పేరును సూచించాడా? అనేది అసలు అనుమానం. ఏదైనా ఇది మంచి పరిణామమేనని అందరు ఒప్పుకుంటారు...! 

Pawan Refers NTR for Trivikram Movie:

Pawan sacrificed his story for NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs