Advertisement
Google Ads BL

ట్రాక్‌ రికార్డును పట్టించుకోని స్టార్‌ హీరో!


సినిమా జయాపజయాలు ఎవరి చేతిలో ఉండవు. విజయం వచ్చినా, అపజయం వచ్చినా అది టీమ్‌ వర్క్‌ మీదనే ఆధారపడుతుంది. ఈ విషయంలో తమిళంలో తిరుగేలేని స్టార్‌ అజిత్‌ కూడా ఓపెన్‌మైండ్‌తో ఉంటాడు. ఆయన ట్రాక్‌రికార్డులను పట్టించుకోడు. ఓ చిత్రం అపజయంలో డైరెక్టర్‌ కంటే తన పాత్రే ఎక్కువని చెప్పుకుని, ఒప్పుకునే ఆరుదైన స్టార్‌ ఆయన. అలాగే టాలెంట్‌ ఉండి ఇబ్బందుల్లో ఉన్నవారికి వారి టాలెంట్‌ని చూసి అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆయన పరిచయం చేసిన మురుగదాస్‌,ఎస్‌.జె.సూర్య వంటి వారు ఎంత ఇమేజ్‌ని సంపాదించుకున్నారో తెలిసిందే. అదే కోవలోకి శివ కూడా చేరుతాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే అజిత్‌ ఆయనతో 'వీరం, వేదాలం, వివేగం' చిత్రాలు చేశాడు. 'వీరం, వేదాలం' కమర్షియల్‌గా మంచి సక్సెస్‌నే సాధించినా, భారీబడ్జెట్‌తో తీసిన 'వివేగం' మాత్రం నిరాశపరిచింది. అయినా కూడా దర్శకుడు శివకి అజితే ప్రోత్సాహం అందించి, సినిమాలలో, ఆటల్లో గెలుపు ఓటములు సహజమని ఓదార్చాడట. అంతేకాదు.. తాను తన తదుపరి చిత్రాన్ని కూడా శివతోనే చేయాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఆయన దర్శకులనే కాదు.. ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలను ఆదుకుంటాడు.

ఒకప్పుడు దిల్‌రాజు, అల్లుఅరవింద్‌ వంటి వారిని మించేలా భారీచిత్రాలు, వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి, ఆ తర్వాత ఆర్దికంగా దెబ్బతిన్న ఎ.యం.రత్నంని తెలుగులో ఎవ్వరూ చేరదీసి ఆదరించకపోవడంతో ఆయనను పిలిచి మరీ అతనికి 'వీరం, వేదాళం' చిత్రాలను చేసిపెట్టాడు. ఇక తాజాగా అజిత్‌-శివ చిత్రానికి సైతం ఎ.యం.రత్నంతోపాటు 'వివేగం' చిత్రం ద్వారా నష్టపోయిన సత్యజ్యోతి బేనర్‌ల భాగస్వామ్యంలో ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకోవడంతో విషయం తెలిసినవారు అజిత్‌ రీల్‌లైఫ్‌లోనే కాదు... రియల్‌లైఫ్‌లో కూడా మానవత్వం ఉన్న మనసున్న వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. 

Again Ajith Movie with Director Siva:

After Vivegam, Ajith and Siva to reunite for the fourth time?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs