Advertisement
Google Ads BL

సమంత భర్తే కాదు శైలజ రెడ్డి అల్లుడు కూడా!


నాగ చైతన్య , మారుతీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలో ప్రారంభం కానుంది. 'బాబు బంగారం' ప్లాప్ తర్వాత 'మహానుభావుడు' హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు మారుతీ. తన ప్రతి సినిమాలో కామెడీ కి ప్రాధాన్యత ఇచ్చే మారుతీ తన నెక్స్ట్ మూవీ కూడా ఫుల్ ఎంటర్టైనర్ గా తీయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది ఎండింగ్‌లో సినిమాను ప్రారంభించే ఆలోచనలో మారుతి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
CJ Advs

ఇది ఇలా ఉండగా ప్రతి సినిమాకి ఏదొక వెరైటీ టైటిల్ తో అలరిస్తాడు మారుతీ. ఇంతకుముందు చైతు - మారుతి సినిమాకి 'మంచోడు' అనే టైటిల్ వాడుకలోకి రావడం దానిని దర్శకుడు మారుతీ కొట్టిపారెయ్యడం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మారుతీ... నాగ చైతన్య తో తీసే సినిమాకి ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించే అవకాశం వుంది అని సమాచారం. నాగ చైతన్య పెళ్లికి ముందు 'యుద్ధం శరణం' డిజాస్టర్ అవ్వడంతో తన నెక్స్ట్ సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని ఉదేశంతో గ్యాప్ తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించి నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలో ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Naga Chaitanya Sailaja Reddy Alludu?:

Naga Chaitanya and Maruthi's Film Title Confirmed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs