Advertisement
Google Ads BL

ఇది బాలయ్యంటే..!


యంగ్ హీరోలు కూడా ఈమధ్య కాలంలో ఏడాదికి మహా అయితే రెండు సినిమాలు కూడా విడుదల చెయ్యలేక చేతులెత్తేస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం యంగ్ హీరోలకు గట్టి పోటీగా తయారయ్యాడు. ఈ ఏడాది మొదట్లోనే  'గౌతమీపుత్ర శాతకర్ణి'తో హిట్ అందుకుని.... పూరి దర్శకత్వంలో 'పైసా వసూల్' యమా ఫాస్ట్ గా రెడీ చేసి విడుదల చేసాడు. ఆ సినిమా ఫలితం బాలయ్యకి కాస్త నిరాశ పరిచినా.. ఇప్పుడు తాజాగా కె ఎస్ రవికుమార్ దర్శత్వంలో 102  సినిమాని కూడా వాయువేగంతో పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమాకి 'జై సింహ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Advertisement
CJ Advs

ఈ సినిమా మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. తండ్రి కొడుకుల పాత్రల్లో బాలకృష్ణ నటిస్తుండగా... మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో నటాషా దోషి, హరిప్రియలు కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని నవంబర్ 1న విడుదల చేసి..... సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా తమిళనాడుతో పాటు హైదరాబాద్ లో కీలక షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. ఇక నవంబర్ నెలాఖరుకల్లా దాదాపు షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది అంటున్నారు. కేవలం ఒకటి రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందంటున్నారు. ఇక ఆ పాటల చిత్రీకరణతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరిత గతిన పూర్తి చేసి సినిమాని సంక్రాంతి బరిలోకి దింపెయ్యడానికి అటు రవికుమార్ ఇటు బాలయ్యలు కృత నిశ్చయంతో ఉన్నారంటున్నారు.

Natasimham Balakrsihna Superfast Express:

No One Can Match to Nandamuri Natasimham Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs