Advertisement
Google Ads BL

మరో టాలీవుడ్ హీరో విలన్ అవుతున్నాడు!


వాస్తవానికి ఏ చిత్రంలో అయినా హీరోయిజం, హీరో ఎలివేట్‌ అవ్వాలంటే అది విలన్‌ క్యారెక్టర్‌ మీదనే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి మనం విలన్‌ అని పిలుస్తాంగానీ మన పెద్దలు దానిని ప్రతినాయకుడిగా పిలవాలని ఎప్పుడో చెప్పారు. ఇక ఈ మద్య వరుసగా పరభాషా విలన్లు వచ్చి, భాష రాక, డైలాగుల మీనింగ్‌ని, ఇతర చిన్నచిన్నవిగా కనిపించే ముఖ్యమైన సీన్స్‌లో పేలవమైన సొంత డబ్బింగ్‌ని హిందీతో పాటు తమ మాతృభాష యాస మాట్లాడుతూ విసిగించేవారు. మన మేకర్స్‌ కూడా భారీగా కండలు పెంచిన వారే విలన్లు అనే మత్తులో ఉండేవారు. బయట ఎంత తిన్నా.. అమ్మ చేతి వంటంత రుచిగా ఉండదు అన్నట్లుగా ఎంత గొప్పవిలన్లు అయినా మాతృభాషా నటులకంటే గొప్పగా ఏమీ చేయలేరని అర్దమవుతుంది. మంచి నటులే అయినా షాయాజీషిండే, ప్రదీప్‌రావత్‌ వంటి వారి ఓన్‌ డబ్బింగ్‌, లేక వేరే వారు డబ్బింగ్‌ చెప్పినా, క్లోజప్‌ షాట్స్‌లో వాళ్ల హావభావాలు, డబ్బింగ్‌కి లిప్‌ సింక్‌ కాకపోవడం వల్ల లాంగ్‌ షాట్స్‌తీయాల్సిన పరిస్థితి. 

Advertisement
CJ Advs

అయితే ఇటీవల జగపతిబాబు, శ్రీకాంత్‌, త్వరలో రాజశేఖర్‌ వంటి వారు హీరోలు విలన్లు అవుతున్నారు. కానీ నాటి చిరంజీవి నుంచి కృష్ణంరాజు వరకు, గోపీచంద్‌ నుంచి తారకరత్న వరకు విలన్లుగా చేసి మెప్పించి, హీరోలుగా మారిన వారే. శ్రీకాంత్‌, రాజశేఖర్‌లు కూడా మొదట్లో విలన్లుగానే నటించారు. ఇక దర్శకులలో తేజకి డిఫరెంట్‌ స్టైల్‌. ఆయన చిత్రాలలో హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో అందులో నటించే విలన్‌ క్రూరత్వం, విలనిజం చూస్తే.. అది సినిమా అని తెలిసినా కూడా వారిని కొట్టాలని, తిట్టాలని అనిపిస్తుంది. 'జయం, నిజం'లో గోపీచంద్‌ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక 'వర్షం'లో గోపీచంద్‌ విలనిజాన్ని అద్భుతంగా పండించాడు. దీనికి బాలీవుక్‌ రీమేక్‌లో మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు విలన్‌గా చేశాడు. ఇక తారకరత్నతో పాటు ప్రస్తుతం కొందరు హీరోలు కూడా విలన్‌ పాత్రలు చేస్తామంటున్నారు. వారిలో నారా రోహిత్‌ నుంచి బాలయ్య వరకు ఉన్నారు. 

ఇక వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలు వస్తే హీరోగానే కాదు.. విలన్‌గా కూడా చేస్తానని ఆల్‌రెడీ నారా రోహిత్‌ చెప్పి ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పుడు హీరోగా బోలెడు చిత్రాలు ఉన్నాయి. అయినా కూడా ఆయన విలన్‌గా నటించడానికి ఓకే. దీంతో తాజాగా 'నేనే రాజు..నేనే మంత్రి' ద్వారా ఫామ్‌లోకి వచ్చిన తేజ తాను తీయబోయే వెంకటేష్‌ చిత్రంలో కీరోల్‌ అయిన విలన్‌ పాత్రకు నారారోహిత్‌ని తీసుకున్నాడట. మరి నారారోహిత్‌ కూడా యంగ్‌ విలన్‌గా ఆది పినిశెట్టి తరహాలో ఆల్‌రౌండర్‌ అనిపించుకోవడం ఖాయమే. ఆయన ఆహార్యం, డైలాగ్‌ డెలివరి నుంచి ఇటీవల సాధించిన సిక్స్‌ప్యాక్‌ కూడా ఆయనకు విలన్‌గా చేయడానికి ప్లస్‌ అవుతుందనే చెప్పాలి. 

Nara Rohit Villain in Venkatesh and Teja Movie:

Nara Rohit Turns Villain for Venkatesh 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs