Advertisement
Google Ads BL

చరణ్‌ని వదలవద్దంటున్న చిరు!


చిరంజీవి గొప్పనటుడే. కె.బాలచందర్‌, విశ్వనాథ్‌ వంటి వారు కూడా ఆయనతో ఓ కమల్‌హాసన్‌, ఓ రజనీకాంత్‌లు లాగా ఉన్నారని చెప్పారు. ఇక ఆయన పూర్తిగా కామెడీ జోనర్‌లో రూపొందిన జంధ్యాల 'చంటబ్బాయ్‌', ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించేలా బాపు 'మంత్రిగారి వియ్యంకుడు', అన్ని వర్గాలను అలరించే ఎమోషన్స్‌తో 'మగమహారాజు.. ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య, విజేత' వంటివి చేశాడు. ఇక తనలోని నటుడిని చూపిస్తూ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో 'స్వయంకృషి, ఆపద్బాందవుడు', భారతీరాజా దర్శకత్వంలో 'ఆరాధన', కె.బాలచందర్‌ దర్శకత్వంలో 'రుద్రవీణ', ఇక తన కెరీర్‌ ప్రారంభంలోనే నటవిశ్వరూపం చూపుతు 'పున్నమినాగు' వంటివి చేశాడు. ఆయనకు మాస్‌ ఇమేజ్‌ కేవలం 'ఖైదీ, రాక్షసుడు' ఇలా ఎన్నో చిత్రాల ద్వారా వచ్చినప్పటికీ ఆయనను ఆల్‌రౌండర్‌గా, అన్ని వర్గాలకు ఆయన చేసిన భిన్నమైన చిత్రాలు, పాత్ర ద్వారానే వచ్చిందనేది వాస్తవం. ఆయన కేవలం మాస్‌ జపం చేస్తున్నా కూడా ఆయన చిత్రాలను ఇప్పటికీ అందరు చూడటానికి కారణం కెరీర్‌లో ఆయన చేసిన విభిన్నచిత్రాల వల్లే సాధ్యమైంది. 

Advertisement
CJ Advs

ఇక ఆయన్ను ఓసారి 'స్వయంకృషి, ఆపద్బాంధవుడు' వంటి చిత్రాలు ఎందుకు చేయరు? అని ప్రశ్నిస్తే.. నాకు కమర్షియల్‌ హిట్‌ మాత్రమే కావాలి. నా నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తారో అదే చేస్తాను. అభిమానులను నా చిత్రాల ద్వారా సంతృప్తిపరచడానికే నేను ఉన్నాను. అంతేగానీ కేవలం కొందరు మాత్రమే ఇష్టపడే చిత్రాలను నేను చేయనని చెప్పాడు. కానీ నేడు చిరు తన 150 చిత్రాలను వెనక్కి వెళ్లి చూస్తే ఆయన మంచి నటనా ప్రతిభ కనబరిచిన చిత్రాలు ఎన్నో ఉంటాయి. అలా తమ కెరీర్‌ సాగేకొద్ది తాము ఇలాంటి చిత్రాలు చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ కొన్ని చిత్రాలు ఉండాలి. 

ఇక రామ్‌చరణ్‌ తన కెరీర్‌ స్టార్టింగ్‌లో కేవలం మాస్‌, యాక్షన్‌ చిత్రాలే చేశాడు. అందులో కూడా కొన్ని ఫ్లాపులున్నాయి. ఫ్లాప్‌లు వచ్చాయని అన్నిరకాల చిత్రాలను చేయకుండా మానుకోకూడదు. అలాగైతే పక్కా మాస్‌ చిత్రంగా వచ్చిన 'బ్రూస్‌లీ' కంటే వైవిధ్యంగా చేసిన 'ధృవ' నే హిట్‌. ఇక విషయానికి వస్తే చరన్‌ వరుసగా 'ధృవ, రంగస్థలం' వంటి చిత్రాలు చేయడం చిరుకి ఇష్టంలేక మాస్‌ చిత్రాలే చేయమని చెప్పి తాను బోయపాటితో చేయాలనుకున్న చిత్రాన్ని చరణ్‌కి సెట్‌ చేశాడని తెలుస్తోంది. 

Ram Charan Doing Boyapati Film with Chiranjeevi's Advice?:

Ram Charan's Mass Entertainer a Right Decision
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs