Advertisement
Google Ads BL

బన్నీ 'డీజే'తో బాక్స్ బద్దలైంది..!


అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కలయికలో వచ్చిన 'డీజే' చిత్రం అనేక కాంట్రవర్సీలకు నెలవైంది. ఈ సినిమా విడుదలకు ముందు బ్రాహ్మణ సంఘాలు 'డీజే' లో బ్రాహ్మణులను కించపరిచే కొన్ని డైలాగ్ ఉన్నాయని.. పోరాడి చివరికి వాటిని తీయించేశారు. ఇక సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. సినిమా విడుదలైన మూడో రోజే 'డీజే' 100 కోట్ల క్లబ్బుని టచ్ చేసిందంటూ అధికారింగా ప్రకటించింది చిత్ర బృందం. కానీ 'డీజే' కలెక్షన్స్ తప్పంటూ స్వయంగా మెగా ఫ్యాన్స్ ధర్నాలు చేశారు. ఏది ఏమైనా దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు.. నిర్మాత దిల్ రాజు మా సినిమా హిట్టన్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా తాజాగా బుల్లితెర మీద కూడా ప్రసారమైంది. 'దువ్వాడ జగన్నాధమ్' సినిమా బుల్లితెర మీద నాన్ 'బాహుబలి' రికార్డులకు క్రియేట్ చేసింది. అసలెవరు ఊహించని విధంగా 'డీజే' సినిమా టీవీల్లో బాహుబలి కే గట్టి పోటీ ఇచ్చింది. ఇంతవరకు తెలుగులో ఏ సినిమా కూడా బాహుబలి తో ఏ విధంగాను పోటీ ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడు 'డీజే' తో బన్నీ 'బాహుబలి' టీఆర్పీ రేటింగ్స్ దగ్గరికి వచ్చేశాడు. బుల్లితెర మీద ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 1 - 23 రేటింగ్ తో మొదటి స్థానంతో నిలవగా.. అదే సీరీస్ లో వచ్చిన బాహుబలి 2 - 22.7 టీఆర్పీని  అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ 'డీజే' కూడా 'బాహుబలి'తో పోటీ పడి 21.78  టీఆర్పీ రేటింగ్ తో మూడో స్థానంలో నిలబడ్డాడు.

అక్టోబర్ 14న జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అయిన 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా టీఆర్పీ రేటింగ్స్ తో అదరగొట్టిందనే విషయాన్నీ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి థియేటర్స్ లో ఎన్నో కాంట్రవర్సీలతో  రన్ అయిన 'డీజే' సినిమా ఇప్పుడు బుల్లితెర మీద మాత్రం దుమ్మురేపింది. ఇక ఈ 'డీజే' రేటింగ్స్ కి అల్లు అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు.

DJ Duvvada Jagannadham Biggest TRP Record:

DJ Duvvada Jagannadham's Big Record on Small Screen
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs