నందమూరి తారకరామారావు అంటే తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ఒక దేవుడు. సినిమా రంగంలోనూ, రాజకీయరంగంలోనూ ఎన్టీఆర్ పేరు మోతమోగిపోయింది. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. కాకపోతే ఎన్టీఆర్ తనజీవితంలో చేసిన అతిపెద్ద తప్పు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకోవడం అంటారు చాలామంది. కొంతమంది ఆయన చివరి దశలో ఎటువంటి కష్టం అనుభవించాడో అందుకే... లక్ష్మి పార్వతిని చేసుకున్నాడు అందులో తప్పేం లేదంటారు. కానీ ఆ పెళ్లితో ఎన్టీఆర్ రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను చాలానే నష్టపోయాడు. రాజకీయాల్లో వెన్నుపోటు... కుటుంబంలో కొడుకులతో వైరం వంటి వాటితో ఎన్టీఆర్ అప్పట్లో బాగా నలిగిపోయాడు. ఆ దెబ్బకే గుండ పోటుతో ఆయన మరణించారు కూడా.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జీవితంతో రామ్ గోపాల్ వర్మ, తేజ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి దర్శకులతో మూడు సినిమాలు తెరకెక్కిస్తున్నామని హడావిడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ.... తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మొదలుపెట్టాడు. ఆయన జీవితాన్ని కూలంకషంగా ప్రజలముందు పెడతానంటున్నాడు బాలయ్య. మరి బావ చంద్రబాబుని బాలయ్య ఈ సినిమాలో పాజిటివ్ గానే చూపిస్తాడు అది పక్కా. అంటే ఎన్టీఆర్ కి ఈ లెక్కన బాబు విషయంలో అన్యాయం చేసినట్టే. ఇక రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించి పెళ్లితో ఒక్కటేలా అయ్యారో... ఆ పెళ్లి తర్వాతి ఎన్టీఆర్ జీవితంలో అనుభవించిన కష్ట సుఖాలను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' లో చూపెడతా అంటున్నాడు.
మరి ఆ సినిమాలో లక్ష్మి పార్వతిని హీరోయిన్ గా... చూపెట్టి చంద్రబాబు ని విలన్ గా చూపెడతాడనే ప్రచారం ఉంది. అందులోను వర్మ తన బయోపిక్స్ లో కేరెక్టర్స్ ని అసలెలా చూపెడతాడో ఆయనకే సరిగ్గా క్లారిటీ ఉండదనే విషయం గత బయోపిక్స్ నిరూపించాయి. ఇక ఇప్పుడు తాజాగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమా కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా చాల సైలెంట్ గా విడుదల చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వదిలిపెట్టడం దగ్గరనుండి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్నదే అంటున్నారు. ఇక సుబ్బారావు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగేవాడని..... వీరగంధం సుబ్బారావుని లక్ష్మీ వదిలి సూట్‌కేస్‌తో బయటకురావడంతో సినిమా మొదలై.....ఎన్టీఆర్ లైఫ్‌లోకి ఆమె ప్రవేశించడంతో సినిమా ముగుస్తుందట.
ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రకి వాణివిశ్వనాథ్ ని తీసుకుంటున్నట్లు..... సుబ్బారావు పాత్రకు నటుడు ఎల్బీ శ్రీరామ్ అని అంటున్నారు. మరి ఇలా ఒకే వ్యక్తి జీవితం మీద ముగ్గురు దర్శకులు ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేస్తుండడం చూస్తుంటే మాత్రం ఎంతో గొప్ప మహానుభావుడు అయిన ఎన్టీఆర్ జీవితం ఇలా కుక్కలు చింపిన విస్తరిలా ఎవరికీ తోచినట్లు వారు ప్రకటించేస్తున్నారు.