Advertisement
Google Ads BL

కరీనాకి పెళ్లి కళ వచ్చేసిందే భామా...!


తెలుగులో తెరనిండా ఆర్టిస్టులు, పట్టుచీరలతో తళతళ మెరుస్తూ ఉండటం, ఇంటి నిండా బంధువుల కోలాహలం, పండుగలు, పబ్బాలు, పెళ్లివేడులు... ఇలా సిల్వర్‌స్క్రీన్‌పై అందరికీ ముచ్చటగొలిపే చిత్రాలు రావడం అరుదనే చెప్పాలి. అప్పుడప్పుడు కృష్ణవంశీ, 'కళ్యాణవైభోగమే', 'జబర్దస్త్‌' వంటి చిత్రాలతో నందిని రెడ్డి కూడా అలాంటి చిత్రాలు తీసింది. అయితే వీటిలో పలు చిత్రాలు బాలీవుడ్‌ చిత్రాలకు ఫ్రీమేక్సే కావడం విశేషం. నిజంగా ఇలాంటి సందడ్లు, పెళ్లిహడావుడ్లు, బంధువులు, స్నేహితుల మధ్య బంధాలు అనుబంధాలను సరైన ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తే వీటిని ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. 

Advertisement
CJ Advs

అయితే మన తెలుగుదర్శకులు అలాంటి చిత్రాలు చేయకపోయినా బాలీవుడ్‌ దర్శకులు మాత్రం అలాంటి చిత్రాలను బాగా తీస్తారు. అలా రూపొందుతున్న చిత్రమే 'వీర్ ది వెడ్డింగ్‌'. ఇందులో కరీనాకపూర్‌, సోనమ్‌కపూర్‌, స్వరాభాస్కర్‌, శిఖా తల్సానియాలు నటిస్తున్నారు. ఈచిత్రం మొత్తం సైఫ్‌ అలీ ఖాన్‌ భార్య అయిన కరీనాకపూర్‌ పెళ్లి వేడుక చుట్టూనే తిరుగుతుంది. ఇక ఈ చిత్రం పోస్టర్స్‌ని ఇటీవల విడుదల చేశారు. దీనిలో ఒక యువతికి మరో యువతి కొంగు కట్టుకోవడంలో సాయం చేస్తూ ఉంటే, మరొకరు చెప్పులు తొడుక్కుంటున్నారు. మరో భామ ఆల్‌రెడీ రెడీ అయిపోయి ఉండగా, మరో అమ్మడు తన హుక్స్‌ పెట్టుకోవడానికి ఎవరైనా సాయం చేస్తారా? అని ఎదురుచూస్తోంది. ఇక పెళ్లిళ్లలోనే కాదు.. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఆడవారు మంచి మ్యాచింగ్‌ డ్రస్‌, దానికి తగ్గట్లుగా మొహిందీలు, మ్యాచింగ్‌ జ్యూయలరీ, కట్టుకునే చీర నుంచి పెట్టుకునే బొట్టు వరకు, వేసుకునే జడ వరకు అన్ని అద్భుతంగా ఉండాలని భావిస్తారు. అదే ఈ చిత్రంలో కూడా చూపించనున్నారు. 

సినిమా నిండా పెళ్లిళ్లు, వేడుకలే ఉంటాయట. తాజాగా 'ముహూర్తం ఫిక్స్‌' అని మరో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ముహూర్తం అంటే విడుదల తేదీ అన్నమాట. ఇక ఈచిత్రం వచ్చే ఏడాది మే 18న విడుదల కానుంది. ఈచిత్రానికి శశాంక్‌ ఘోష్‌. ఆయన గతంలో రాజేంద్రప్రసాద్‌తో 'క్విక్‌ గన్‌ మురుగన్‌' 'ముంబై కట్టింగ్‌', 'ఖూబ్‌ సూరత్‌' చిత్రాలను తీశాడు. ఇది కూడా 'తను వెడ్స్‌ మను'లా హిట్టయితే ప్రీగా రీమేక్‌ చేసుకోవడానికి కృష్ణవంశీ, నందిని రెడ్డి వంటి వారికి మరో కథా వస్తువు దొరికినట్లే భావించాలి. 

Veere DI Wedding First Look Poster Released:

Kareena Kapoor in Veere DI Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs