కమెడియన్ గా చేస్తున్న సునీల్ హీరోగా టర్న్ తీసుకున్నాడు. అయితే హీరో గా తన కెరీర్ ఏం బాగోలేదని బాగా గ్రహించినట్టుగా వున్నాడు. అందుకే ఇప్పుడు హీరో నుండి కమెడియన్ గా మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. హీరోగా నటిస్తూనే కమెడియన్ గా కొనసాగుతానని తాజాగా స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాడు. అయితే ఇప్పుడు కామెడీతోపాటే కేరెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలని సునీల్ ఫిక్స్ అయ్యాడంటున్నారు. హీరో నుండి కమెడియన్ గా చేస్తానని అలా స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో ఇలా చిరంజీవి 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి' లో ఎంపికయ్యాడనే వార్తలు ఫిలింసర్కిల్స్ లో హల్చల్ చేశాయి. కాకపోతే అది పక్కాగా కామెడీ రోలా లేకుంటే... మరేదన్న పాత్ర అనేది క్లారిటీ లేదు.
ఇప్పుడు తాజాగా సునీల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన దర్శకుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. తాజాగా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ చిత్రంలో సునీల్ కి త్రివిక్రమ్ ఒక అద్భుతమైన పాత్ర సృష్టించినట్టుగా ప్రచారమవుతుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కోసమే ఒక ప్రత్యేకమైన రోల్ ని త్రివిక్రమ్ సృష్టించినట్లుగా వార్తలొస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చెయ్యబోయే ఈ సినిమాతో సునీల్ మరలా కమెడియన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతాడనే సంకేతాలు అందుతున్నాయి.
ఇకపోతే ఎన్టీఆర్ సినిమాకన్నా ముందే 'సై రా' కి సైన్ చేసిన సునీల్.... త్రివిక్రమ్ సినిమాతోనే ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఎందుకంటే 'సై రా' సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు విడుదలకు సిద్దమవుతుందో తెలియదు. ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల సినిమా ఆరు నెలల కన్నా ఎక్కువ సమయం పట్టదు. దీన్ని బట్టి సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఎన్టీఆర్ చిత్రంతోనే ఉండబోతుందన్నమాట.