Advertisement
Google Ads BL

శ్రీదేవి అభిమానుల గుండెలు బద్దలైపోతున్నాయ్!


నాటికీ నేటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవినే అని చాలా మంది నమ్ముతారు. 'ఓరి బ్రహ్మదేవుడో..కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో.. ఏడ దాచినావురో..' అంటూ తన సినిమాలో శ్రీదేవిని వర్ణిస్తూ ఆమె వీరాభిమాని రాంగోపాల్‌వర్మ ఆమె అందానికి ఫిదా అయిపోయి రచయితచేత రాయించి 'గోవిందా..గోవిందా' చిత్రం పెట్టాడు. ఇక శ్రీదేవి వర్మకే కాదు.. ఎందరికో శృంగార దేవత. అలాంటివారు బోనీకపూర్‌ వంటి సెకండ్‌ హ్యాండ్‌ని ఆమె వివాహం చేసుకోవడం తెలిసి బోనీకపూర్‌ అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారు. ఇక తాజాగా ఆమె భర్త బోనీకపూర్‌ ఆమెకి పబ్లిగ్గా ఓ ముద్దు ఇచ్చి వాటిని సోషల్‌మీడియాలో పెట్టేయడంతో తమకు దక్కని అదృష్టం ఆయనకు దక్కడం చూసిన వర్మ వంటి శ్రీదేవి వీరాభిమానులకు ఆయనపై గొంతువరకు కోపంవచ్చి ఉంటుంది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల ఓ వేడుకకు శ్రీదేవి, ఆమె పెద్దకూతురు జాహ్నవి కపూర్‌, చిన్నకుమార్తె ఖుషీ కపూర్‌లు ఒకే రకం ఫ్యాషన్‌ దుస్తులతో హాజరయ్యారు. దాంతో మీడియా కెమెరాల నుంచి ఆ వేడుకకు వచ్చిన అతిధుల వరకు శ్రీదేవి ఇద్దరు కూతుర్ల కంటే శ్రీదేవినే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అయింది. అందరి చూపు ఆమె అందాలపైనే. ఇక శ్రీదేవిని నేటికి అతిలోక సుందరి అని భావించే వారు ఉన్నట్లే ఇప్పుడు శ్రీదేవిని చూస్తే ఆమె కూతుర్లకు అమ్మగా కంటే బామ్మగా కనిపిస్తోందని కామెంట్స్‌ చేసేవారు ఉన్నారు. ముఖ్యంగా 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌, పులి, మామ్‌' చిత్రాలను చూసిన వారు ఆమెతోటి నాయకలైన సీనియర్లు మాధురి దీక్షిత్‌, జయప్రద వంటి వారు ఇంకా తమ గ్లామర్‌తో మెప్పింస్తుంటే శ్రీదేవి మాత్రం ముఖంలోముసలితనం కనిపిస్తోందని, ఆమె వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్లే ఆమె అలా తయారైందని కూడా వాదిస్తారు. 

ఇక తాను 50ఏళ్ల కెరీర్‌ సందర్భంగా ఆమె తన భర్త బోనీకపూర్‌ నిర్మాతగా 'మామ్‌' చిత్రంలో నటించింది. ఈచిత్రం సరిగా ఆడకపోయినా ఆమెకి మంచిపేరు తెచ్చింది. దాంతో శ్రీదేవి ఇతర నిర్మాతల నుంచి వచ్చే ఆఫర్లను కాదని, కేవలం తన భర్త నిర్మించే చిత్రాలలోనే నటిస్తానని తేల్చిచెబుతుండటంతో ఈమె మంచి అవకాశాలను పోగొట్టుకుంటూ ఉందని బాధపడుతున్నారు. మరి ఆమె అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో దేవుడికే తెలియాలి.

Sridevi and Bony kapoor Kiss Pic Sensation:

Fans Hurt with Sridevi Kiss Pic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs