Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ ఎంట్రీ ఈ చిత్రంతోనేనా..?


సింగీతం శ్రీనివాసరావు.. ఆయనది ప్రత్యేకమైన స్కూల్‌. మూకీ చిత్రంగా 'పుష్పక విమానం', ప్రయోగాత్మక చిత్రాలుగా 'విచిత్ర సోదరులు, మైఖేల్‌ మదనకామరాజు, భామనే సత్యభామనే, మేడమ్‌, భైరవద్వీపం, ఆదిత్య 369' వంటి ఎన్నో ఆణిముత్యాలను తీశాడు. ముఖ్యంగా కమల్‌ నటునిగా తన విశ్వరూపం చూపించే చిత్రాలను తీసిన వారిలో కె.విశ్వనాథ్‌, సింగీతం శ్రీనివాసరావులది ప్రత్యేకస్థానం. ఇక జానపద చిత్రంగా బాలయ్యతో 'భైరవద్వీపం'తీసి, అందులో బాలయ్యను కురూపిగా చూపించి మెప్పించాడు. ఇక ఇండియాలోనే తొలి సైన్స్‌ఫిక్షన్‌ చిత్రంగా టైమ్‌ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌తో 'ఆదిత్య 369' తెరకెక్కించాడు. ఈ చిత్రం నాడు ఎంత ఆదరణ పొందిందే అందరికీ తెలుసు. బాలయ్య కెరీర్‌లో 'భైరవద్వీపం, ఆదిత్య 369' లది ప్రత్యేకస్థానం. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు వచ్చే ఏడాది హీరోగా పరిచయం కానున్న నందమూరి మోక్షజ్ఞపైనే అందరి చూపు ఉంది. ఆయన మొదటి చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తాడని, కాదు బోయపాటి శ్రీనుతో ఆయన మొదటి చిత్రం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇక నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి చాలా కాలం కింద మాట్లాడుతూ, మోక్షజ్ఞ తెరంగేట్రం మూవీని తనకే ఇస్తానని మాట ఇచ్చాడని చెప్పాడు. సో.. బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌ రూపొందనున్న బాలయ్య, సాయికొర్రపాటి, విష్ణు ఇందూరిల 'బ్రహ్మతేజ' బేనర్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండనుందని అర్ధమవుతోంది. ఇక మోక్షజ్ఞ తెరంగేట్రం చిత్రం బాలయ్య డైరెక్షన్‌లో ఉంటుందని, ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో ఓ పాత్ర చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. 

తాజాగా ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కూడా ఆయన చిన్న పాత్ర చేస్తాడని అంటున్నారు. అది కూడా నిజమో కాదో తెలియదు. కానీ బాలయ్య కాస్త చిత్తచాపల్యం ఉన్న వ్యక్తి కాబట్టి క్రిష్‌, బోయపాటి శ్రీను వంటి వారి పేర్లు కూడా పుకార్లేనని నమ్మవచ్చు. బోయపాటితో అయితే మొదటి చిత్రం అసలు ఉండదు. ఇక తాజాగా 'ఆదిత్య 369' దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. దీనికి స్క్రిప్ట్‌ కూడా రెడీ అయింది. బాలయ్య గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి. ఈ చిత్రంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు. బాలయ్య ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. బాలయ్య ఎప్పుడు రెడీ అంటే నేను కూడా అప్పుడే రెడీ అని చెప్పుకొచ్చాడు. ఎంతైనా మోక్షజ్ఞ ఎంట్రీ సింగీతం వంటి దిగ్గజ దర్శకునితో, వెరైటీగా ఉండే 'ఆదిత్య 369' కి సీక్వెల్‌ ద్వారా చేస్తేనే బాగుంటుందని చెప్పవచ్చు. 

Singeetham Srinivasa Rao Clarity on Mokshagna Entry:

Singeetham Srinivasa Rao Ready to Direct Balakrishna's Son
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs