Advertisement
Google Ads BL

కొత్త టైటిల్స్ అండీ.. కొంగొత్త టైటిల్స్ అండీ!


టాలీవుడ్ లో సినిమాల మీద కన్నా టైటిల్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. ఒక హీరో సినిమా సెట్ అయ్యి పట్టాలెక్కింది అంటేనే అనేక రకాల టైటిల్స్ వాడుకలోకొచ్చేస్తాయి. అలాగే ఆయా హీరో చిత్ర బృందం ఆ టైటిల్ ని అధికారికంగా ప్రకటించక ముందే ఆ చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించిన టైటిల్స్ వాడుకలోకి వచ్చేస్తాయి. ఇక ప్రేక్షకుల నాడిని బట్టే ఆ టైటిల్ ని సదరు నిర్మాతలు ఫిక్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని టైటిల్స్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన టైటిల్స్ ఏ హీరోకు అనే విషయంపై కాస్త క్లారిటీ ఉండేది. కానీ ఈసారి అలాంటి క్లారిటీ కూడా లేకుండా టైటిల్స్ విడుదలవ్వడం కొద్దిగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Advertisement
CJ Advs

వారాహి చలన చిత్రం బ్యానర్ పై 'ఎన్.టి.ఆర్' అనే టైటిల్ ని నిర్మాత సాయి కొర్రపాటి రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ఎవరికోసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ నిర్మాత... సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'ఈ నగరానికి ఏమైంది' అనే టైటిల్ ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది. అయితే ఈ టైటిల్ ఏ హీరోకి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే త్వరలోనే ఈ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ప్రస్తుతం పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఇదే బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. వీటితోపాటు మరో 2 చిన్న సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉన్నాయి. వీటిలో  'ఈ నగరానికి ఏమైంది' అనే టైటిల్  ఏ సినిమాకు పెట్టబోతున్నారనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇక టాలీవుడ్ మరో నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'ఓ మనసా నీకు తెలుసా' అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ఈ టైటిల్ కూడా రాజుగారు ఎవరి కోసం రిజిస్టర్ చేయించారనేది సస్పెన్స్. ప్రస్తుతానికి నాని, రాజ్ తరుణ్ తో సినిమాలు చేస్తున్నాడు దిల్ రాజు. వీటికి ఆల్రెడీ టైటిల్స్ పెట్టేశారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో వరుసగా మహేష్, సాయిధరమ్ తేజ్, హరీశ్ శంకర్ సినిమాలున్నాయి. మరి ఏ హీరో - దర్శకుడు సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు.

వీటితో పాటు హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై 'సైలెంట్ మోడ్' అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ అయింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వారు కూడా చాలా సినిమాలు ప్లాన్ చేశారు. ప్రస్తుతం పవన్ తో ఒక సినిమా చేస్తున్న ఈ బ్యానర్ నిర్మాతలు త్వరలోనే ఎన్టీఆర్, నాగచైతన్య, నిఖిల్ తో సినిమాలు ప్లాన్ చేశారు. ఈ హీరోల్లో ఎవరికీ ఆ టైటిల్ ని పెడతారో చూడాలి.

New Registered Titles in Tollywood:

NTR, Ee Nagaraniki Yemaindi, Silent Mode, O Manasa Neeku Telusaa Titles Registered
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs