పవన్‌కళ్యాణ్ నటించిన డిజాస్టర్ మూవీ 'కొమరం పులి'తో తెలుగు తెరకు పరిచయమైన భామ నికేషా పటేల్. తొలి చిత్రం అందునా పవన్ సరసన నటిస్తుండటంతో అందరూ ఈమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అనుకున్నారు. కానీ అది వమ్మయింది. తర్వాత చిన్నాచితకా హీరోలతో కలిసి నటించినా కూడా ఈమె కనీస గుర్తింపును కూడా తెచ్చుకోలేదు. ఆమె నటించిన చిత్రాలే ఏమని? అడిగితే ఆమెకైనా గుర్తుంటాయో లేదో గానీ గూగుల్‌తల్లికి తప్ప మరెవ్వరికీ ఆమె చేసిన పాత్రలు సరే ఆమెకు కూడా గుర్తుండదు. మరి ఈ భామ మరలా అందరి కంట్లో పడేదెలా అనే విషయం రీసెర్చ్ చేస్తున్నట్లుగా ఉంది.
కేవలం తన హాట్‌హాట్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే ఈ అమ్మడు ఎందుకు ఇప్పుడు అంతలా ఫోటోలు పోస్ట్ చేస్తోందని అందరూ సందేహిస్తారు. దీని కోసం ఆమె తగిన కారణం ఎంచుకుని దర్శకనిర్మాతలను, హీరోలను, ప్రేక్షకులను తనను గుర్తుంచుకునేలా చేసేందుకు ఓ చెత్త మార్గం కనుక్కుంది. ఇక విషయానికి వస్తే సెల్‌లలోనే కెమెరాలు వస్తుండటంతో మాములు ఫోటోలు కనుమరుగై సెల్ఫీమోత దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. సెల్ఫీల మోజులో నాటి హైదరాబాద్ కాలేజీ విద్యార్ధులు ఉత్తర భారతంలోనదిలో కొట్టుకుపోయి దుర్మరణం చెందారు. అదే తరహాలో సెల్ఫీ మోజులో పడి పలువురు ప్రమాదాలకులోనై తనువు చాలిస్తున్నారు. చివరకు ప్రభుత్వాలు ఎయిడ్స్, టీవీ, సిగరెట్, మద్యం తరహాలోనే ప్రజలకు సెల్ఫీల ప్రమాదాలను కూడా చెబుతూ జాగరూకత అవసరమని హెచ్చరిస్తున్నారు.
ఇక నికిషా పటేల్ తాజాగా క్లీవేజ్ షోని చూపిస్తూ ఓ ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో అమ్మడి అందాలు, మేకప్‌లపై కూడా పలు కామెంట్స్ వస్తున్నాయి. కాగా తన ఫోటో ఎందుకు పెట్టానో అన్నట్లుగా కుంటి సాకు చెప్పేందుకు.. నేను సెల్ఫీ స్టిక్‌తో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్నాను.. మొదటిసారి సెల్ఫీస్టిక్‌తో ట్రై చేస్తున్నాను. నాకు కాస్త హెల్ప్ చేసిపెట్టమని పోస్ట్ చేసింది. మరి ఆమెకు సెల్ఫీస్టిక్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసే మగాడు ఎవరో వేచిచూడాల్సివుంది..! కాకపోతే లేడీస్ అయినా ఫర్వాలేదా? అనేది ఆమెనే అడగాలి....!