Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడిపై కన్ను పడింది!


టాలెంట్‌ ఎక్కడ కనిపించినా గీతాఆర్ట్స్‌వారు వెంటనే బిస్కెట్‌ వేస్తారు. తాజాగా తీసుకుంటే 'మనం' సినిమా రిలీజ్‌ అయిన వెంటనే గీతాఆర్ట్స్‌ నుంచి విక్రమ్‌ కె.కుమార్‌కి ఫోన్‌ వెళ్లింది. ఇక బోయపాటిశ్రీను, సురేందర్‌రెడ్డిలకు కూడా అలాంటి బిస్కెట్స్‌నే గీతాఆర్ట్స్‌ వేసింది. ఇక మారుతి, పరుశురామ్‌తో పాటు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత వి.ఐ.ఆనంద్‌ వంటి వారికి కూడా ఫోన్లు వెళ్లాయి. మెగా కాంపౌండ్‌హీరోలు అరడజనుకు పైగా ఉండటంతో ఒకరి కోసం పిలిచి వారు తయారు చేసిన సబ్జెక్ట్‌లను ఒక్కసారిగా మెచ్చుకోకుండా మార్పులు, చేర్పులు చేయించి, మొత్తానికి హిట్‌ చిత్రం కథను మెగాకాంపౌండ్‌ తయారు చేసేలా చేస్తుంది. ఫలానాహీరోకి అని దర్శకులకు కాల్‌ చేసి,చివరకు కథ అవుట్‌పుట్‌ని బట్టి ఎవరికి సూట్‌ అవుతుందో వారితోనే సినిమాలను నిర్మిస్తారు. ఏదైనా సినిమా విడుదలై హిట్‌ అయిందంటే చాలు వారికి అభినందనల పేరుతో ఫోన్‌ వెళ్లడం, వెంటనే రెండు మూడు చిత్రాలకు అగ్రిమెంట్‌ చేసుకునే తరహా విధానాన్నివారు పాటిస్తారు. ఒక్కసారి ఓ కథను ఓకే చేయడంతో సరిపోదు. ఆ కథను మెగా కాంపౌండ్‌లోని అందరికీ వినిపించి, వారు చెప్పిన మార్పులు చేర్పులు చేయిస్తారు. మొత్తానికి దర్శకులని ఎంతగా విసిగించినా ఆ దర్శకుడికి లైఫ్‌ వచ్చేలా చేస్తారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా 'పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌'లతో హ్యాట్రిక్‌ని నమోదు చేసిన అనిల్‌రావిపూడికి కూడా గీతాఆర్ట్స్‌ నుంచి కాల్‌ వెళ్లిందట. కమర్షియల్‌ కథలు, సాధారణ కథలకే తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని, ఎమోషన్స్‌ని మిక్స్‌చేసి స్టైలిష్‌గా చూపిస్తూ హిట్‌ కొట్టడం అనిల్‌రావిపూడికి బాగా వర్కౌట్‌ అవుతోంది. అందునా ఆయన ఆల్‌రెడీ మెగాహీరో సాయిదరమ్‌తేజ్‌తో హిట్టు కూడాకొట్టి ఉన్నాడు. 

దాంతో అల్లుఅర్జున్‌, అరవింద్‌ల నుంచిఅనిల్‌కి కూడా ఫోన్‌ వెళ్లిందట. అల్లుఅర్జున్‌ కోసం ఓ కథను సిద్దం చేసుకోమని చెప్పడంతో అనిల్‌రావిపూడి ఎంతో ఆనందంగా ఓ స్టార్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం కెరీర్‌ మొదట్లోనే రావడం తన అదృష్టంగా భావిస్తున్నాడని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అల్లుఅర్జున్‌ వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నాపేరు సూర్య- నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషాచిత్రం చేస్తూ నేరుగా కోలీవుడ్‌ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఆయన లిస్ట్‌లో విక్రమ్‌ కె.కుమార్‌, ఓ కొత్త దర్శకుడు, వి.ఐ.ఆనంద్‌వంటి వారు కూడా ఉన్నారు. మరి అనిల్‌ చిత్రం పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టేట్లు ఉంది...!

Allu Arjun Interested To act in Anil Ravipudi Direction :

Allu Aravind and Allu Arjun Eyes on Anil Raavipudi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs