Advertisement
Google Ads BL

రానా లుక్ అద్భుతంగా ఉంది!


మన సీనియర్‌స్టార్స్‌ మాత్రమే కాదు.. యంగ్‌స్టార్స్‌ కూడా బాలీవుడ్‌, కోలీవుడ్‌ హీరోలలాగా లుక్‌లను, గెటప్పులను సామాన్యంగా మార్చరు. పాత్ర ఎలాంటిదైనా అదే లుక్‌లో కనిపిస్తూ ఉంటారు. ఇక గడ్డం పెంచడం, తీసేయడం, విగ్గు మార్చడం మాత్రమే ప్రత్యేక లుక్‌లుగా వారు భావిస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం 'బాహుబలి' చిత్రంతో అసలు లుక్‌లంటే ఏమిటి? పాత్రకు తగ్గట్లుగా కనిపించడం, గెటప్‌లను మార్చడం ఎలా? అనేది చేసి చూపించాడు. ఇందులోని ప్రతిపాత్రా సరికొత్తగా కనిపించడంతో ప్రేక్షకులు ఎంతో రిలాక్స్‌గా, వైవిధ్యంగా ఫీలయ్యారు. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్‌ 'నాన్నకుప్రేమతో' చిత్రంలో కాస్త వెరైటీగా కనిపించినా, 'జైలవకుశ'లో మూడు పాత్రలను ఒకే తరహా గెటప్‌ని మెయిన్‌టెయిన్‌ చేశాడు. అదే కమల్‌,విక్రమ్‌, రజనీ వంటివారు అలా కాదు. ఇక రానా దగ్గుబాటి తన కెరీర్‌లో గడ్డం తీసేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇక 'బాహుబలి'లో భళ్లాలదేవగా తన గెటప్‌తో మెప్పించాడు. ఇక 'నేనేరాజు నేనే మంత్రి' చిత్రంలో పంచెకట్టుతో డిఫరెంట్‌ లుక్‌తో ఓకే అనిపించాడు. కాగా ప్రస్తుతం రానా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న '1945' అనే పీరియాడికల్‌ తరహా మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్య్ర పూర్వం జరిగిన కథ. ఇందులో రానా సుభాష్‌చంద్రబోస్‌ ఆర్మీలో పనిచేసే సైనికుడిగా నటిస్తున్నాడని సమాచారం. 

ఈ చిత్రం కోసం ఆయన గెటప్‌మార్చేసి, మీసాలు ఉంచి, ఆర్మీవారివలే జుట్టును కత్తిరించుకుని, గడ్డం తీసేసి క్లీన్‌షేవ్‌తో కనిపిస్తున్న న్యూలుక్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన తన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ 'గడ్డం పోయింది. షూటింగ్‌తో మరో కాలానికి వెళ్తున్నాం. '1945' కోసం కొత్తలుక్‌ కోసం ప్రయత్నిస్తున్నా.. ఫస్ట్‌లుక్‌ నవంబర్‌లో విడుదల అవుతుందని' తెలిపాడు. తమిళంలో 'మదైతీరంతు' పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని ఇదే ఏడాది తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి విడుదల చేసి ఈ ఏడాదిలో నాలుగో సినిమాను రిలీజ్‌ చేయనున్నాడు యంగ్‌ అండ్‌ వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌ రానా దగ్గుబాటి...!

Daggubati Rana New Periodic Look For 1945:

Daggubati Rana finally gave up his beard. His dense and thick grown beard which was well maintained all the way from last four to five years from Baahubali times to his first successful heroic act Nene Raju Nene Mantri is now disappeared.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs