Advertisement
Google Ads BL

రష్మీ కౌంటర్ అనసూయపైనేనా..?


తెలుగు బుల్లితెరకు హాట్‌ సొగసులను అద్దిన వారిలో రేష్మిగౌతమ్‌ కూడా ఒకరు. అలా మొదట వెండితెరపై చిన్న వేషాలు, తర్వాత బుల్లితెరపై హాట్‌ అందాల ప్రదర్శనలతో మెప్పించిన ఈ భామ నటించిన 'గుంటూరు టాకీస్‌' చిత్రాన్ని సగటు ప్రేక్షకులు మర్చిపోలేరు. తన అందాలను ఆరబోసి ఈచిత్రంలో ఆమె చూపిన గ్లామర్‌షో మూలంగానే చిత్రం కమర్షియల్‌ హిట్‌ అయిందంటే అతిశయోక్తి కాదేమో. కాగా ప్రస్తుతం ఈమెకు మరో బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయతో పోటాపోటీ నడుస్తోంది. అనసూయ క్రేజీ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటే రేష్మి మాత్రం వెనుకబడి పోయింది.

Advertisement
CJ Advs

'గుంటూరు టాకీస్‌'ని తన అందాలతో ఒక్క చేత్తో విజయాన్ని అందించిన ఈ భామకు తర్వాత అలాంటి చిత్రం గానీ, క్యారెక్టర్‌ గానీ రాకపోవడం ఆశ్చర్యకరమే. తాజాగా ఆమె నటించిన 'నెక్ట్స్‌ నువ్వే' చిత్రం విడుదల కానుంది. ఇందులో తాను చీరకట్టులోనే ఉంటూ గ్లామర్‌ ఒలకబోస్తానని చెప్పింది. తనకు ఇలాంటి పాత్రలు, ఫలానా స్టార్స్‌తోనే చేస్తానని కండీషన్‌ ఏమీ లేదని, కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలలో పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లాలనేది తన అభిమతం అని చెబుతూనే పనిలో పనిగా ఇన్‌డైరెక్ట్‌గా అనసూయకి కౌంటర్లు వేసింది. 

ఈ చిత్రంలో డబుల్‌ మీనింగ్స్‌ పాత్రల పరంగానే ఉంటాయని, మన దర్శకుల విజన్‌ని, అల్లుఅరవింద్‌, బన్నీవాసు వంటి వారి విజన్‌ని మనం గౌరవించాలని చెబుతూనే, ఈ చిత్రంలో డబుల్‌ మీనింగ్స్‌ ఉన్న విషయాన్ని ఒప్పుకుంది. రాత్రి పూట పనిచేయడం బోర్‌ కొట్టేసిందని, ఇకపై హర్రర్‌ చిత్రాలు చేయనంది. ఇక తాను జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మితలు పోషించిన పాత్రలైనా ఓకేనని కానీ పాత్ర క్యారెక్టరైజేషన్‌, కంటెంట్‌ ముఖ్యమని, తనకు కంఫర్టబుల్‌గా ఉండే కాస్ట్యూమ్స్‌నే వేస్తానని, లేకపోతే నో చెబుతానని చెప్పింది. ప్రస్తుతం ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నానని, అది తప్ప తను చేస్తున్న ఇతర చిత్రాలేమీ సెట్స్‌పై లేవని చెప్పుకొచ్చింది...!

Rashmi Counter on Anasuya:

Rashmi Gautham Talks about Next Nuvve Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs