డాక్టర్ రామానాయుడు బతికున్నంత వరకు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ వెలుగు వెలిగింది. ఈ బేనర్ నుంచి మూడు పెద్ద చిత్రాలు.. ఆరు చిన్న చిత్రాలు అన్నట్లుగా నిత్యం చిత్రాలు వచ్చేవి. పది మందికి పని దొరికేది. కానీ ఆయన మరణం తర్వాత సురేష్‌బాబు తన తండ్రి పేరును నిలబెట్టడంలో తీవ్రంగా వైఫల్యం చెందాడు. తమ ఫ్యామిలీలోనే వెంకటేష్, రానా దగ్గుబాటి, అక్కినేని నాగచైతన్య వంటి హీరోలు ఉన్నప్పటికీ ఈయన సురేష్ ప్రొడక్షన్స్ పరుగెత్తించలేక పోతున్నారు. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు కొల్లగొట్టడం ఎలా? అని తప్పితే సినిమాకి తగ్గట్లు ఖర్చు పెట్టడం, ఇటు చిన్న అటు పెద్ద చిత్రాలు రెండింటిని తీయడం, సినిమాల కథలను కరెక్ట్‌గా జడ్జ్ చేయలేమోనని తనకు తాను భయపడుతున్నట్లుగా ఉంది ఆయన ధోరణి.
కాగా ఈయన 'పెళ్లిచూపులు' చిత్రాన్ని తానే రిలీజ్ చేశాడు. దాంతో సినిమా చూసి కొత్త దర్శకుడైన తరుణ్‌భాస్కర్‌లో విషయం ఉందని గ్రహించాడు. అనుకున్నట్లుగానే 'పెళ్లిచూపులు' పెద్ద విజయం సాధించడంతో పాటు, చిత్రానికి, స్క్రీన్‌ప్లేకి గాను తరుణ్‌భాస్కర్‌కి కూడా జాతీయ అవార్డులను తెచ్చిపెట్టింది. కానీ ఎంతో ముందు చూపు ఉన్న సురేష్‌బాబు ఈ దర్శకుడిని తన బేనర్‌లోనే బంధించేశాడు. 'పెళ్లిచూపులు' తదుపరి చిత్రం తన బేనర్‌లో, తాను చెప్పిన బడ్జెట్‌లో అంతా కొత్తవారితో చేయాలని కండీషన్ పెట్టాడట. దాంతో పలువురు హీరోలు తరుణ్‌భాస్కర్ డైరెక్షన్‌లో చేయడానికి ముందుకొచ్చినా కక్క లేక మింగ లేక తాను కొత్తవారితో సినిమా చేస్తాను. పెద్ద స్టార్స్‌తో తీసి వారి రూట్లోకి నేను వెళ్లను. చిన్నచిత్రాలైతేనే ఫ్రీడం ఉంటుందని చెబుతూ వచ్చాడు.
ఎలాగౖెెతేనేం.. చిన్నగా చాలా గ్యాప్ తీసుకుని సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమాని పట్టాలెక్కించాడు. ఇది కూడా న్యూ జనరేష్ స్టోరీనే అట..! 'పెళ్లిచూపులు' సమయంలో కూడా పెద్దగా గుర్తింపు లేని విజయ్‌దేవరకొండ, రీతూవర్మ, ప్రియదర్శి వంటి వారితో రక్తి కట్టించిన ఆయన మరోసారి కొత్తవారితో ఈ చిత్రం చేస్తున్నాడు. ఇక ఒకప్పుడు కెరీర్ బిగినింగ్‌లో తేజని ఫాలో అవుతూ, అలాగే 'నేనే రాజు నేనే మంత్రి'తో తక్కువ బడ్జెట్‌లో తీసి సురేష్‌బాబుకి లాభాల పంట పడించి తనకు తాను మరలా ఫామ్‌లోకి వచ్చి వెంకటేష్, బాలయ్యాస్ ఎన్టీఆర్ బయోపిక్‌లను తన్నుకుపోయిన విధంగానే తరుణ్‌భాస్కర్ కూడా అదే దారిలో వెళ్లి సక్సెస్ కొట్టి పెద్ద ఆఫర్లు పడతాడేమో చూడాలి మరి!