Advertisement
Google Ads BL

ఇలియానా పెళ్లి చేసుకుంది నిజమేనా?


'దేవదాస్‌' చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి యంగ్‌స్టార్స్‌ అందరినీ టాలీవుడ్‌లో ఓ రౌండ్‌ వేసిన గోవా బ్యూటీ ఇలియానా. ఈ నడుము సుందరి తెలుగులో తొలిసారిగా కోటిరూపాయల పారితోషికం అందుకున్న మొదటి హీరోయిన్‌గా తన పేరును లిఖించుకుంది. ఇక తనలాంటి నాజూకు నడుము, పుట్టుకతోనే వచ్చిన సైజు జీరో అందాలను చూసి బాలీవుడ్‌ ప్రేక్షకులు ఏ శ్రీదేవి, జయప్రదలానో నెత్తిన పెట్టుకుంటారని భావించి ముంబై ఫ్లైట్‌ ఎక్కింది. అక్కడ రెండు మూడు చిత్రాలతో విజయం సాధించినా తాననుకున్న స్టార్‌ హోదా రాక కూరలో కరివేపాకుగా మిగిలింది. మరోవైపు టాలీవుడ్‌కి రావడం నామోషీగా భావించి, ఇక్కడి నుంచి ఆఫర్లు వచ్చినా టాలీవుడ్‌కు నోఎంట్రీ బోర్డ్‌ పెట్టేసి, బాలీవుడ్‌లో నా హవా చాటుతానని గొప్పలు పోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమెకు ఆస్ట్రేలియన్‌ బోయ్‌ఫ్రెండ్‌, ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం మొదలైంది. అతని ప్రేమ మత్తులో పడి సినిమాలకు బాగానే దూరంగా జరిగింది. ఇటు దక్షిణాదిన, అటు బాలీవుడ్‌లో రెండు చోట్ల ఒకేసారి సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ని పెంచుకునే బదులు వచ్చిన అవకాశాలను కూడా కాదనుకుంది. ఈ మద్యలోనే ఆమెకు, ఆమె బోయ్‌ఫ్రెండ్‌కి తేడాలొచ్చి ఆయన తన పాటికి తాను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. రీఎంట్రీలో తనను నటించమని అడిగితే సీనియర్‌ స్టార్స్‌తో నటించను. నేను అడిగినంత పారితోషికం ఇస్తేనే నటిస్తాను. కుర్రస్టార్సే కావాలని పట్టుబడుతోంది. బాలీవుడ్‌ని ఏలుతున్న హీరోయిన్లు కూడా ఖాన్‌త్రయంతో పాటు అందరితో నటిస్తుంటే ఈమె మాత్రం కుర్రహీరోలే కావాలని పట్టుబట్టింది. ఆ వ్యవహారం కూడా బెడిసికొట్టింది. 

దాంతో మరలా దిక్కులేక ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లు ఆ పాత బోయ్‌ఫ్రెండ్‌నే మరలా పంచన చేర్చుకుంది. ఈ మద్య తన స్నేహితులతో దిగిన ఓ ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఈ ఫోటోని నా బెటర్‌ హాఫ్‌ తీశాడు. నాలాగే మీరు కూడా మీలో సగంగా భావించే ప్రియుడిని పెళ్లాడండి అని కామెంట్స్‌ చేసింది. దీంతో లవర్‌ని ఇప్పుడే బెటర్‌ హాఫ్‌ అని పిలవడం, మరోవైపు అందరికి తమలో సగం అయిన మగాళ్లతో పెళ్లాడనని చెప్పడంతో బిటౌన్‌లో ఈమెకు అండ్రూ నీబోన్‌కి వివాహం జరిగిపోయిందని, కానీ ఇది బయట పెడితే తన ఛాన్స్‌లు తగ్గుతాయని దాస్తోందని వార్తలు గుప్పుమన్నాయి. మరి నిప్పు లేనిదే పొగరాదు కదా...! 

Rumors on Ileana Marriage:

Gossips on Ileana and Andrew Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs