Advertisement
Google Ads BL

విరాట్, అనుష్క లు డాక్టర్ ని ఎందుకు కలిశారు?


మనదేశంలో సినీతారలు, క్రికెటర్లని మించిన సెలబ్రిటీలు కనిపించరు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహామహులు, ఎందరో శాస్త్రవేత్తల కంటే వీరే బాగా ఫేమస్‌. ఇక ఈ సినీతారలకు, క్రికెటర్లకు ఉండే ఎఫైర్లు కూడా ఇప్పటివి కావు. కపిల్‌దేవ్‌-సుమలత, కపిల్‌దేవ్‌-జయసుధ, కపిల్‌దేవ్‌- సారికాహాసన్‌, యువరాజ్‌సింగ్‌-కిమ్‌శర్మ, రవిశాస్త్రి- అమృతాసింగ్‌, ధోని-లక్ష్మీరాయ్‌, అజారుద్దీన్‌-సంగీతా బిజలానీలతో పాటు నాటి పటౌడీ-షర్మిలాఠాగూర్‌ వరకు ఎందరినో చెప్పుకోవచ్చు. ఇక పాకిస్థానీ క్రికెటర్లయిన ఇమ్రాన్‌ఖాన్‌, వసీం అక్రమ్‌, షాహిద్‌ ఆఫ్రిది, షోయబ్‌మలిక్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌, ది గ్రేట్‌ వివియన్‌ రిచర్డ్స్‌లు కూడా జీనత్‌ అమన్‌ నుంచి నీనాగుప్తా వరకు ఎఫైర్లు నడిపిన వారే. కాకపోతే వీరిలో నేటి క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్కశర్మలది మరింత ప్రత్యేకత. 

Advertisement
CJ Advs

ఎందుకంటే దాదాపు వీరు పెళ్లి చేసుకోవడం ఇక కాకతాళీయమే అంటుంటారు. ఇండియా క్రికెట్‌ జట్టు ఏ దేశ పర్యటనకు వెళ్లినా కూడా అక్కడ అనుష్క శర్మ వాలిపోతుంది. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటన ముగించుకున్న కోహ్లి అమెరికాలో దిగి అక్కడికి ఆల్‌రెడీ రమ్మని పిలుపునందుకున్న అనుష్కశర్మలు కలిసి యూఎస్‌, యూకెలలో జాలీగా గడిపారు. ఇక ప్రస్తుతం ఇండియా మన దేశంలోనే వరుస సీరీస్‌లు అడుతుండే సరికి పాపం.. అనుష్కశర్మకి ప్రయాణభారం తగ్గింది. తాజాగా విరాట్‌కోహ్లి- అనుష్కశర్మల జంట ప్రముఖ ఆక్యుపెంచరిస్ట్‌ డాక్టర్‌ జెవెల్‌గమాడియాను కలుసుకున్నారు. ఈయన ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లయిన కత్రినాకైఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లకు నమ్మకస్తుడైన డాక్టర్‌.   వీరు - అనుష్క జంట తాజాగా ఆ వైద్యుడిని కలిశారు. 

మరి ట్రీట్‌మెంట్‌కో లేక మరి దేనికోసమో తెలియదు గానీ వారు ఆ డాక్టర్‌ని కలుసుకున్నప్పుడు ఆయన ఆ జంటతో సెల్ఫీలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. దాంతో ఈ ఫోటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ జంట పలు ఈవెంట్లకు, ప్రకటనలకు పనిచేస్తుండటం, ఆల్‌రెడీ సహజీవనం చేస్తున్నారని వార్తలు వస్తుండటంతో వీరు కలిస్తే గైనకాలజిస్ట్‌లనో మరొకరినో కలవాలి గానీ ఆక్యుపెంచరిస్ట్‌తో వీరికేం పని అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Lovebirds Anushka and Virat pay a visit to a Doctor Together:

Virat Kohli and Anushka Sharma visited a renowned acupuncturist together
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs