Advertisement
Google Ads BL

రవితేజ నిజంగా చాలా గ్రేటప్ప..!


హీరోలలో రవితేజది డిఫరెంట్‌ స్టైల్‌. ఆయన నోటి నుంచి వచ్చే డైలాగులు, ఆయన నటించే సీన్స్‌, ఆయన బాడీల్వాంగేజ్‌ నుంచి అన్ని ఆయన ప్రత్యేకతను తెలిపేవే. ఆయన ప్రతి కదలిక జయాపజయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మంచి కిక్‌నిస్తాయి. ఇక నటనలోని అన్ని అంశాలలో ఆయనదైన జోష్‌, ఎనర్జీ వంటివి కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే గాడ్‌ఫాదర్‌ లేకుండా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మాస్‌మహారాజాగా వెలిగాడు. ఇక ఆయనలోని జోష్‌ నేటితరంలో రామ్‌, రాజ్‌తరుణ్‌ వంటి వారిలో కనిపిస్తున్నా దానిని రవితేజతో పోల్చిచూడటం, వయసు పెరుగుతున్నా.. నటించిన సినిమాలు పెరిగి పోతున్నా కూడా ఆయన ఎనర్జీ, కిక్‌, జోష్‌ తగ్గలేదు. 

Advertisement
CJ Advs

ఆయన అంత జోష్‌తో ఉంటాడు కాబట్టే అదే జోష్‌ సహ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శకులకు మంచి కిక్‌నిస్తూ ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు పూర్తయ్యేలా చేసేవాడు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మరలా రవితేజలోని ఫుల్‌ ఎనర్జీని దర్శకుడు అనిల్‌రావిపూడి అందుకుని, తనకు తగ్గట్లు మలుచుకున్నాడు. అదే నేడు 'రాజా ది గ్రేట్‌' సాధారణ కథతో కూడా కలెక్షన్లు కొల్లగొట్టేలా చేస్తోంది. ఇక రవితేజలో కమిట్‌మెంట్‌ కూడా చాలా ఎక్కువే. అదే 'రాజా ది గ్రేట్‌' షూటింగ్‌ సమయంలోనే ఆయనపై డ్రగ్స్‌ ఆరోపణలు వచ్చినా కూడా అనుకున్న సమయానికి చిత్రం బయటకు వచ్చేలా చేసింది. ఇక రవితేజకి చెందిన ఓ బ్యాడ్‌ ఇన్సిడెంట్‌ని కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి చెప్పే దాకా ఎవ్వరికీ తెలియదు. 

ఈ చిత్రం షూటింగ్‌లో రవితేజకి యాక్సిడెంట్‌ అయిందట. ట్రైన్‌సీన్‌ని చిత్రీకరించే సమయంలో ఓ వ్యాన్‌ రవితేజకి తీవ్రంగా గాయపరుస్తూ ఈడ్చుకుని వెళ్లిందట. దాంతో దర్శకుడు అనిల్‌రావిపూడి తో పాటు అందరం ప్యాకప్‌ చెబుదామని భావించినా, రవితేజ ఒప్పుకోకుండా సినిమాను పూర్తయ్యే వరకు అదే కమిట్‌మెంట్‌తో పనిచేశాడని, రవితేజ నిజంగా 'గ్రేట్‌' అని చిత్రంలో కీలకపాత్రను పోషించి మెప్పించిన కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి తెలిపాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే తనకు ఓ గుడ్‌ న్యూస్‌ కూడా తెలిసిందని, చాలా ఏళ్ల తర్వాత నేను మరలా తండ్రికి కాబోతున్నాననే విషయం ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే తనకు తెలిసిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే రవితేజ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెబుతూనే, మరలా తండ్రి కాబోతున్న శ్రీనివాసరెడ్డికి కంగ్రాట్స్‌ చెప్పాల్సిందే. 

Comedian Srinivas Reddy Talks About Ravi Teja Greatness:

Comedian Srinivas Reddy Says One Good News and One Bad News
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs