Advertisement
Google Ads BL

మహేష్‌ కోసం 'కృష్ణా ముకుందా మురారి'..!


ఈ మద్య దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో తాను వెంకటేశ్వరస్వామి భక్తుడినని, దాంతో రాముడికి, కృష్ణుడికి కోపం రావడం వల్ల తాను నిర్మించిన 'రామరామ..కృష్ణ కృష్ణ, రామయ్యా వస్తావయ్యా, కృష్ణాష్టమి' వంటి ఫ్లాప్‌లొచ్చాయని చెబుతూనే కాస్త తమాషాకి అన్నా కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. కాగా దిల్‌రాజుకు మరోసారి రాముడు, కృష్ణుడుల నుంచి గండ ఉందా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 'భరత్‌ అనే నేను' చిత్రం తర్వాత మహేష్‌బాబు.. దిల్‌రాజు- అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో 'బృందావనం, ఊపిరి' వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వంశీపైడిపల్లి 'కృష్ణా ముకుందా మురారి' లేదా 'హరే రామ..హరే కృష్ణ' టైటిల్స్‌ని పరిశీలిస్తున్నాడట. 

Advertisement
CJ Advs

ఇక వంశీ పైడిపల్లి 'ఊపిరి' తర్వాత పివిపి సంస్థకు మరో చిత్రం చేస్తానని చెప్పినప్పుడే వంశీపైడిపల్లి 'కృష్ణా ముకుందా మురారి' టైటిల్ ని రిజిష్టర్‌ చేశాడట. ఇందులో తన తండ్రి, కుమారుడు గౌతమ్‌కృష్ణల పేరులో ఉన్న కృష్ణా అనే పదం రావడం, తన కెరీర్‌ ప్రారంభంలోనే 'మురారి' టైటిల్‌తో సినిమాని మెప్పించడంతో 'కృష్ణా ముకుందా మురారి' అనే టైటిల్‌నే మహేష్‌ ఓకే చేయవచ్చని భావిస్తున్నారు. ఇక ఎంతో కాలం నుండి దర్శకుడు క్రిష్‌ అశ్వనీదత్‌ బేనర్‌లో మహేష్‌బాబుతో చిత్రం చేయాలని భావించి 'హరే రామ హరే కృష్ణ' అనే టైటిల్‌ని రిజిష్టర్‌ చేయించాడు. మొత్తానికి మహేష్‌ రాముడిగా యుద్దనీతిని పాటిస్తాడా? లేక కృష్ణుడి టైప్‌లో మాయా నీతిని అనుసరిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక దిల్‌రాజుకి, వంశీపైడిపల్లికి కూడా 'బృందావనం'తో కాస్త కలిసి రావడం ఒక్కటే ఇక్కడ ప్లస్‌ పాయింట్‌...! 

Mahesh and Vamsi Paidipalli Movie Title Krishna Mukunda Murari:

Two Titles for Vamsi Paidipalli and Mahesh Babu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs