Advertisement
Google Ads BL

ఆ సినిమాలు వద్దంటూనే 'మగధీర'కి ఎసరెట్టేసింది!


'అందాలరాక్షసి' చిత్రం ద్వారా పరిచయమైన నిజంగా అందాలరాక్షసి లావణ్యత్రిపాఠి. ఆ తర్వాత ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో పాటు 'శ్రీరస్తు.. శుభమస్తు'లో కూడా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈమెకు ఇప్పటికే వరుసగా 'మిస్టర్‌, రాధ, యుద్దం శరణం' చిత్రాలతో డిజాస్టర్లను ఎదుర్కొంది. ఇక తమిళంలో '100%లవ్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న '100%కాదల్‌' చిత్రం చేస్తానని చెప్పి మరీ చివరి నిమిషంలో హ్యాండివ్వడంంతో ఆ మేకర్స్‌ 'అర్జున్‌రెడ్డి' ఫేమ్‌ షాలిని పాండేని తమన్నా పాత్రకి తీసుకుని సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌చాంబర్‌లో లావణ్య త్రిపాఠి వల్ల వచ్చిన నష్టంపై కేసు వేశారు. 

Advertisement
CJ Advs

ఇక ఈమె ప్రస్తుతం గీతాఆర్స్‌ బేనర్‌లో విజయ్‌దేవరకొండ హీరోగా పరుశురామ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం విషయంలో కూడా ఇబ్బందులు పెడుతుండటంతో ఆమెని ఈ చిత్రం నుంచి తీసేశారని సమాచారం. ఇక ఈమె ప్రస్తుతం నటించిన రామ్‌ హీరోగా రూపొందుతున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పాత్ర గురించి ఎంతో గొప్పగా చెబుతున్న యూనిట్‌ని ఏ ఒక్కరు లావణ్యత్రిపాఠి గురించి చెప్పడంలేదు. ఇది సెకండ్‌ హీరోయిన్‌ పాత్రా? అని లావణ్యని అడిగితే మాత్రం సెకండ్‌, ఫస్ట్‌ అని ఏమీ లేదు. చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో పాత్ర ఒకటి అంటూ కవరింగ్‌ ఇస్తోంది. ఎప్పటినుంచో తన స్నేహితులు రామ్‌తో కలిసి నటించు.. మీ జోడీ బాగుంటుందని అంటున్నారని అది ఈ సినిమాతో నెరవేరిందని గొప్పలు చెబుతోంది. 

ఈ పాత్ర కోసం మొదట మేఘాఆకాష్‌ని తీసుకున్న విషయంపై స్పందిస్తూ ఇండస్ట్రీలో ఇది మామూలే.. ఇందులో మేఘా అనే పాత్ర చేస్తున్నాను. ఎంతో బబ్లీ క్యారెక్టర్‌ అని చెప్పుకొచ్చింది. వరుస ఫ్లాప్‌ల గురించి మాట్లాడుతూ, నాకు హిట్స్‌ కూడా ఉన్నాయి మరి వాటి సంగతి మర్చిపోతే ఎలా?అంటూ హర్రర్‌ చిత్రాలు చూస్తానే గానీ చేయనని, తాను వాటికి సూట్‌ కానని, లవ్‌స్టోరీలే చేస్తానని, ముఖ్యంగా 'మగధీర' వంటి చిత్రంలో నటించాలని ఉందని తెలిపింది. అయినా ఈమె అడిగినంతనే 'మగధీర' వంటి చిత్రం వస్తుందా? అణకువగా, క్రమశిక్షణతో ఉంటేనే వేషాలు వస్తాయి. కాస్త తేడా కొడితే బయటికి నెట్టేస్తారు సుమా! 

Lavanya Tripathi Talks About Vunnadhi Okate Zindagi:

Lavanya Tripathi Vunnadhi Okate Zindagi Movie Interview Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs