Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరింది!


ప్రభాస్ ని బాహుబలి చిత్రం తర్వాత అందరూ బాహుబలి ప్రభాస్ అనే సంబోధిస్తున్నారు. ఐదేళ్ల కష్టానికి బాహుబలితో కావాల్సినంత క్రేజ్ తోపాటు అంతే ప్రతిఫలాన్ని అందుకున్నాడు. బాహుబలిలో కండలు తిరిగిన వీరుడిగా బాహుబలి పాత్రలో ప్రభాస్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభాస్ నుండి రాబోయే సాహో చిత్రంలో ప్రభాస్ ఎలా వుండబోతున్నాడో అని ప్రభాస్ అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150  కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రం జాతీయ స్థాయిలో రూపు దిద్దుకుంటుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం మొదలు పెట్టకముందే సాహో టీజర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన చిత్ర బృందం నేడు అక్టోబర్ 23  న ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా సాహో  సినిమా ప్రభాస్ లుక్ ని విడుదల చేసింది. టీజర్ తోనే హైప్ క్రియేట్ చేసిన చిత్ర బృందం  ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనూ అదరగొట్టేశాడు. అసలు సాహోలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో టీజర్ లోనే చూసాం గాని... ఇప్పుడు వదిలిన ఈ పోస్టర్ లో మాత్రం మొహంపై సగానికి పైగా ముసుగు కప్పుకుని.. ఎత్తైన  కట్టడాల మధ్యన  ఆరడుగుల ఆజానుభాహుడు నడిచొస్తుంటే.. చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్టుగా వుంది సాహోలో ప్రభాస్ లుక్. ఇక ప్రభాస్ పుట్టిన రోజునాడు సాహోలో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు కేక్ కటింగ్స్ తో పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో.. బోలెడుమంది బాలీవుడ్ నటులు విలన్స్ గా నటిస్తుండగా.... ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తుంది. 

Prabhas Saaho First Look Poster:

On this special day of Prabhas birthday, finally UV Creations released exclusive first look poster of Prabhas from the upcoming flick Saaho.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs