Advertisement
Google Ads BL

విజయేంద్రప్రసాద్ 'మెర్సల్' తర్వాత కథలివే!


తెలుగు సినీ రచయిత, రాజమౌళికి కుడి భుజం అయిన ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌ 'మగధీర, ఈగ, బాహుబలి, భజరంగీభాయిజాన్‌'లకు రచయితగా పనిచేశాడు. తాజాగా ఆయన స్క్రీన్‌ప్లే అందించిన విజయ్‌ చిత్రం 'మెర్సల్' సంచలనం సృష్టిస్తూ, దేశవ్యాప్తంగా సంచలనం సృషిస్టోంది. తాను కథ అందించిన చిత్రాలే టాప్‌లో ఉండటం దేవుని దయ అంటున్న ఆయన దర్శకునిగా హిట్‌ కావాలనే సినిమా తీశాను. ప్రేక్షకులు ఆదరించలేదు. వారు ఆదరించేలా త్వరలో చిత్రాలను తీస్తానని చెప్పాడు. ఇక 'మెర్సల్' చిత్రంలో వైద్యవ్యవస్థపై చిత్రం తీద్దామని అట్లీ అనడంతో ఎంతో ఎగ్జైట్‌ అయి ఈచిత్రం తీశానని, తమిళంలో 'బాహుబలి' చిత్రం హయ్యస్ట్‌ గ్రాసర్‌ అని చెబుతున్నారు..'మెర్సల్' తమిళంలో 'బాహుబలి'ని క్రాస్‌ చేస్తుందని భావిస్తున్నాను. వైద్యం అనేది సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. సింగపూర్‌లో 8 శాతం జీఎస్టీ మాత్రమే ఉంది. కానీ అక్కడ ప్రజలకు ఉచిత వైద్యం, మందులు అందజేస్తున్నారు. మనదేశంలోఅలా లేదు. 

Advertisement
CJ Advs

ప్రభుత్వాలను, అధికారులు, రాజకీయనాయకులను ప్రశ్నించే చిత్రాలు రావాలి. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో రూపొందుతున్న ఝాన్సీలక్ష్మీభాయ్‌ జీవిత చరిత్ర 'మణికర్ణిక'కు కథను అందిస్తున్నాను. ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడిన అస్సాంకు చెందిన రచిత్‌ కుల్‌ భౌహిత్‌ ఆధారంగా ఓ కథ, ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ఛీఫ్‌ గోవాల్కర్‌ జీవితకథను రాస్తున్నాను. ఇక తెలుగులోవచ్చిన 'విక్రమార్కుడు'కి హిందీవెర్షన్‌ అయిన 'రౌడీ రాథోడ్‌'కి సీక్వెల్‌, హిందీలో వచ్చిన 'నాయక్‌' ( తెలుగులో శంకర్‌ 'ఒకేఒక్కడు' ) చిత్రాలకు సీక్వెల్స్‌ రాస్తున్నాను. ఇక రాజమౌళి క్రేజ్‌ ఉన్నప్పుడే వరుసగా చిత్రాలు చేసే వ్యక్తి కాదు. నేను కథ చెప్పినప్పుడు వెంటనే సినిమాకి తీయాలి అనిపించేలా కథ ఉన్నప్పుడే చేద్దామని చెప్పాడు. అయితే గ్రాఫిక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌లు లేకుండా, వాటి కోసం నిపుణులు మన ఇంటికి రాకుండా ఉండేలా కథను రాయమని చెప్పాడు. సోషల్‌ఎలిమెంట్స్‌తో ఉన్నచిత్రం రాస్తే అది రాజమౌళికి నచ్చిన తర్వాతే హీరో ఎవరో నిర్ణయిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక తమిళంలో సంచలనాలు సృష్టిస్తోన్న 'మెర్సల్' చిత్రం 'అదిరింది'గా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంపై వస్తున్న వివాదాలు సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడతాయని ఆయన తేల్చిచెప్పాడు. 

Vijayendra Prasad next Stories List:

Vijayendra Prasad Promotes Mersal Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs