Advertisement
Google Ads BL

మహానటిలో ఈ దర్శకుడు పాత్ర ఏంటో తెలుసా?


దర్శకుడిగా క్రిష్ చేసినవి కొద్ది  సినిమాలే అయినా.. విభిన్న కథలతో  సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. గౌతమీపుత్ర లాంటి చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్... ఇప్పడు తాజాగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణికా' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తెర వెనక కథ నడిపిన క్రిష్ మొదటిసారి వెండితెరమీద కనిపించబోతున్నాడట. అలనాటి మేటినటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రంలో క్రిష్ నటించబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే టాలీవుడ్, తమిళ, మలయాళం నుండి హేమాహేమీలు నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు క్రిష్ కూడా కనిపించబోతున్నాడనే ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. సావిత్రి జీవితం అటు నటనారంగంలో... ఇటు వ్యక్తిగత జీవితంలో రెండిటీలో ఆమె పడిన కష్ట నష్టాలు .. ఆమె అనుభవించిన సుఖసంతోషాలను వెండితెర మీద ఆవిషరించబోతున్నాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలో ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు వంటి వారు ఎంతో ముఖ్యమైన  పాత్ర పోషించారు.  సావిత్రి, ఎస్వీరంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు నటించిన 'మాయాబజార్' సినిమాకి సంబందించిన సన్నివేశాలు కూడా 'మహానటి' లో ఉండబోతున్నాయట. 

ఇప్పటికే ఎస్వీఆర్ పాత్రకి మోహన్ బాబు ఎంపిక కాగా... ఏఎన్నార్, ఎన్టీఆర్ పాత్రలకు ఇంకా నటులను ఎంపిక చెయ్యాల్సి ఉండగా... ఇప్పుడు మాయాబజార్ దర్శకుడు కేవి రెడ్డి పాత్ర కోసం దర్శకుడు క్రిష్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక 'మహానటి'లో కెవి రెడ్డి పాత్ర చేసేందుకు క్రిష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ తో పాటు ఇంకెంతమంది ఈ సినిమాలో నటించబోతున్నారో అనే ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి సావిత్రి జీవితంతో ఎంతోమంది ప్రముఖులు ముడిపడి ఉన్నారన్నది జగమెరిగిన సత్యం.

Director Krish in Mahanati Movie:

Director Krish Plays KV Reddy Role in Mahanati Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs