నేడు యువత రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఉందని పలు నాయకులు ఊదరగొడుతూ ఉంటారు. అయితే యువనాయకత్వం అనేది రంగరంగానికి మారిపోతుంది. క్రీడాకారుల్లో 30ఏళ్లు దాటితే వెటరన్. అదే రాజకీయాలలో 50ఏళ్లు దాటినా యువనాయత్వమే. ఇక సినిమాల్లో చావు వచ్చేదాకా అదే హీరోయిజం. ఇక ఉపరాష్ట్రపతిగా తెలుగువాడైన వెంకయ్యనాయుడుని ఎంపిక చేసినప్పుడు ఆయన అభిమానులు మంచి రాజ్యాంగ పదవి, అందులోనూ దేశంలోనే రెండో అత్యున్నత పదవి రావడం కొందరి బాధ కలిగించింది. వెంకయ్యను క్రియాశీలక రాజకీయాల నుంచి, కేంద్రంలోని మంత్రిగా హవా చాటడం నుంచి తప్పించేందుకే మోదీ ఈ పనిచేశారని విమర్శలు వచ్చాయి.
కానీ నాడు మోదీ వెంకయ్యనాయుడు వయసు మీరి పోతోంది కాబట్టి ఇంకా యాక్టివ్‌గా ఉండలేరని, కాబట్టి ఆయనను ఉపరాష్ట్రపతికి పరిమితం చేసి ఆయన ఆర్యోగం దృష్ట్యా ఆ పనిచేశాడని, మోదీ అనుకూల వర్గాలు చెప్పుకొచ్చాయి. తాజాగా వెంకయ్య మామూలు చెకప్‌ల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ కాస్త అస్వస్థతగా ఉన్న ఆయనకు డాక్టర్ సంజయ్‌భార్గవ్ వైద్యుల బృందం పరీక్షించి, యాంజియోప్లాస్టీ నిర్వహించడంతో మోదీ అనుకూలురు యువ నాయకత్వంకి అవకాశంఇవ్వడం, వెంకయ్య ఆరోగ్యం దృష్ట్యానే మోదీ ఆయనను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించి ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వడం గురించి తమ వాదన నిజమేనని నిరూపితమైందని అంటున్నారు.
ఇక వెంకయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనను మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ఆయనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, ప్రధాని నరేంద్రమోడీలు పరామర్శించారు.