Advertisement
Google Ads BL

చిరుకి హ్యాండిచ్చి.. కమల్ తో హ్యాండ్ కలిపాడు!


తండ్రి సినిమాలకు నిర్మాతగా మారిన హీరో రామచరణ్...... చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా 'సై రా నరసింహరెడ్డి' ని భారీ బడ్జెట్ పెట్టి మరీ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు కూడా ఎనౌన్స్ చేసింది చిత్ర బృందం. 'సై రా' ని జాతీయ స్థాయిలో తెరకెక్కుస్తున్నారు కాబట్టి... జాతీయ స్థాయిలో అంటే... మరి ఎంతో గ్రాండ్ గా ఉండాలి కదా.. అందుకే 'సై రా' కోసం టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన రవివర్మన్ ని పెట్టుకున్నారు. అయితే కాని కొన్ని కారణాల వల్ల రవివర్మన్ ఈ 'సై రా నరసింహారెడ్డి' నుండి తప్పుకున్నాడు. అసలు సినిమా సెట్స్ మీదకెళ్లకముందే రవివర్మన్ ఈ సినిమా నుండి ఎందుకు బయటికి వచ్చాడో క్లారిటీ లేదుగాని... ఏదో డేట్స్ సర్దుబాటు కాలేదనే ప్రచారం అయితే జరిగింది.

Advertisement
CJ Advs

అయితే ఆ సినిమా నుంచి బయటపడిన వెంటనే రవివర్మన్ మరొక పెద్ద సినిమా అవకాశం దక్కించుకున్నాడు అంటున్నారు. తమిళనాట 'దశావతారం, 7th సెన్స్' సినిమాలకు అద్భుతమైన కెమెరా పనితనాన్ని చూపించిన రవివర్మన్ బాలీవుడ్ లో కూడా 'జగ్గా జాసూస్' చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించాడు. అంతేకాకుండా టాలీవుడ్ లో అల్లు అర్జున్ - వి వి వినాయక్ కలయికలో తెరకెక్కిన 'బద్రినాథ్' సినిమాకు కూడా వర్క్ చేశాడు. ఇకపోతే రవివర్మన్, చిరు 'సై రా' కి బై బై చెప్పేసి ఇప్పుడు తమిళనాట శంకర్ - కమల్ హాసన్ కలయికలో వస్తోన్న 'ఇండియన్ 2' సినిమాకు అవకాశం దక్కించుకున్నాడనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వినబడుతున్నాయి. 

దర్శకుడు  శంకర్ తో ఇంతకుముందు 'అపరిచితుడు' సినిమాకి పనిచేశాడు రవివర్మన్. 'అపరిచుతుడు' తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు మరోసారి ఆయనతో కలవబోతున్నాడు రవివర్మన్. మరి డేట్స్ సర్దుబాటు కావట్లేదు అని 'సై రా' నుంచి బయటకి వెళ్ళిన రవివర్మన్ 'ఇండియన్ 2'కి డేట్స్ ని ఎలా సర్దుబాటు చేయగలిగాడు అని ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Cameraman Ravi Varman Out From Sye Raa Narasimha Reddy:

Cameraman Ravi Varman in for Shankar and Kamal Indian 2. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs