ఒక సినిమాకి కథ రాసుకునేటప్పుడే ఆ దర్శకులకు ఆ పాత్రను ఓ హీరోతో చేయించాలి? పెడుతున్న బడ్జెట్ దృష్ట్యా బిజినెస్ రేంజ్ పెరగాలంటే ఎవరిని హీరోగా తీసుకోవాలి? అనేది మదిలో మెదులుతుంది. ఇక 'రోబో' చిత్రంలో రజనీ మ్యాజిక్ చేశాడు. దీనికి సీక్వెల్‌గా '2.0' తీయాలని భావించినప్పుడు రజనీకి ఆరోగ్య సమస్యలు ఉండటంతో అమీర్‌ఖాన్‌కి వెళ్లి శంకర్ స్టోరీ చెప్పాడట. 'రోబో'కి కూడా శంకర్ మొదట షారుఖ్‌ని సంప్రదించిన సంగతి తెలిసిందే. ఇక '2.0' స్టోరీ అమీర్‌కి బాగా నచ్చేసిందట. అందునా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు. తనకు రజనీనే స్వయంగా ఫోన్ చేసి చాన్స్ మిస్ చేసుకోవద్దు... ఖచ్చితంగా చేయి అన్నాడట.
కానీ శంకర్ కథను తలుచుకున్నప్పుడల్లా అమీర్‌కి రజనీనే జ్ఞప్తికి వస్తూ ఉండటంతో కాదు సార్.. మీరే ఎలాగైనా చేయండి. మిగిలిన విషయాలు ఆలోచించవద్దని అమీర్.. రజనీకి సర్దిచెప్పారట. ఇక అమీర్ ఇంకా మాట్లాడుతూ, నేను రజనీ సార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన స్టైల్ అంటే నాకు పిచ్చి. ఆయనలా నేను నటించలేను. ఆయనలా మ్యాజిక్ చేయలేను. రోబో చూశాను. ఆ నటనే నాకు మనసులో ఉండిపోయింది. దాంతో శంకర్‌కి కూడా ఎలాగైనా రజనీ చేతనే చేయించమని చెప్పానని అమీర్ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా 'బాహుబలి' తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న చిత్రం '2.0'నే. 'బాహుబలి'ని మించే సత్తా ఈ చిత్రానికే ఉందని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి చిత్రంలో అమీర్ తాను వద్దనుకుని రజనీనే చేయాలని పట్టుబట్టడం, రజనీ సైతం అమీర్‌ని చేయమని అడగటం గ్రేటే. ఇక 450కోట్ల బడ్జెట్‌తో ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా ఇది రూపొందుతోంది. 'బాహుబలి' రెండు పార్ట్‌లకు కలిపి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లకు 100కోట్ల బడ్జెట్ అయితే కేవలం '2.0' చిత్రానికి 150కోట్లు అంచనా. వచ్చేఏడాది జనవరి 25న విడుదల కానున్న ఈ చిత్రం ఆడియోను త్వరలో దుబాయ్‌లో, తర్వాత టీజర్‌ను హైదరాబాద్‌లో, ట్రైలర్‌ని ముంబైలో, ప్రీరిలీజ్ వేడుకను చెన్నైలో నిర్వహించనున్నారు.