రెండేళ్ల గ్యాప్ తర్వాత 'రాజా ది గ్రేట్'గా వచ్చిన రవితేజ ఇప్పటికీ తనలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అంధునిగా కనిపిస్తూనే తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌కాకుండా చూసుకున్నాడు. కొత్తదనంలేని 'ఒక్కడు' వంటి చిత్రమే అయినా ఈ చిత్రం బాగానే ఆడుతోంది. ఇక ప్రస్తుతం రవితేజ, విక్రమ్ సిరికొండ అనే నూతన దర్శకునితో 'టచ్ చేసి చూడు' చేస్తున్నాడు. దీని తర్వాత తమిళ 'బోగన్' రీమేక్‌లో నటిస్తాడని అంటున్నారు. ఇక శ్రీనువైట్లతో ఓ చిత్రం ఉండనుంది.
తాజాగా ఈయన ఖాతాలో మరో చిత్రం వచ్చిందని అంటున్నారు. 'సోగ్గాడే చిన్నినాయన'తో నాగార్జునకు, 'రారండోయ్ వేడుక చూద్దాం'తో నాగచైతన్యకి.. ఇలా కళ్యాణ్‌కృష్ణ కోసూరి తండ్రి కొడుకులకు మంచి హిట్లు ఇచ్చాడు. ఈయన 'సోగ్గాడే చిన్నినాయన'లోని బంగార్రాజు పాత్ర ఆధారంగా నాగార్జునతో చిత్రం చేయాలని భావించాడు. ఈచిత్రం మొదట చేస్తానని చెప్పిన నాగ్ ప్రస్తుతం ఆ చిత్రం చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో 'బంగార్రాజు' కథను 'సోగ్గాడే చిన్నినాయన'కు ప్రీక్వెల్ కథను తయారు చేసి, నాగార్జున కోసం రాసుకున్న పాత్రలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కళ్యాణ్‌కృష్ణ.. రవితేజకి చెప్పి ఓకే చేయించాడని సమాచారం. దీనికి బండ్ల గణేష్ నిర్మాత అని కూడా తెలుస్తోంది.
నిత్య పెళ్లికొడుకుగా కనిపించిన ఆడవారితో సరసాలు చేసే పాత్రను నాగార్జున తర్వాత రవితేజ అయితేనే మెప్పిస్తాడనేది నిజమే. ఈ విధంగా చూసుకుంటే ఇది నిజమైన వార్తేనని అనిపిస్తోంది. మరోపక్క కళ్యాణ్‌కృష్ణ.. వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీస్టారర్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మేనమామ, మేనల్లుడి కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుందన్న మాట.. మరి ఈ రెండు వార్తల్లో ఏది నిజమో త్వరలోనే తెలుస్తుంది.