ఆగష్టులో చిరు 151 వ చిత్రం అధికారికంగా భారీ ప్రకటనతో మొదలైంది. కానీ ఇంతవరకు ఆ సినిమా సెట్స్ మీదకి రాలేదు. చిరు 151 వ చిత్రాన్ని ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా 'సై రా నరసింహారెడ్డి'గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే 'సై రా' చిత్రం అదిగో... సెట్స్ మీదకెళుతుంది. ఇదిగో... సెట్స్ మీదకెళుతుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది కానీ... ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే మరో వారం రోజుల్లో 'సై రా' రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో ఇప్పుడు ఇంకో విషయమై తర్జన భర్జలు జరుగుతున్నాయట.
అదేమిటంటే ఉయ్యాలవాడ జీవిత చరిత్ర 'సై రా' కోసం చిరంజీవి ఎప్పటినుండో మేకోవర్ అవుతున్నాడు. 'సై రా నరసింహారెడ్డి' కి మేకోవర్ అయిన లుక్ తోనే చిరు బయట జరిగే అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నాడు కూడా. ఇక అదే లుక్ ని ఫిక్స్ చేస్తూ బోలెడు ఫోటో షూట్స్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. అంతేకాకుండా ఆ లుక్ తో అనేకరకాల డ్రాయింగ్స్ ని కూడా గీయించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం చిరు ఇప్పడున్న లుక్ ఫైనల్ అనుకుంటున్న టైం లో ఆ లుక్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారనే టాక్ వినబడుతుంది.
'సై రా' కోసం చిరు లుక్ తో పాటే గెటప్ ని కూడా చేంజ్ చెయ్యాలని చూస్తున్నారట. మరి అంతా ఓకే అనుకున్నాక ఇలా లుక్ మార్పులు అంటే.... కారణం సరిగ్గా క్లారిటీ రావడంలేదుగాని లుక్ మార్పు తధ్యం అనే సంకేతాలు అందుతున్నాయి. మరి మేకోవర్ కోసం నెలలు నెలలు టైం తీసుకుంటారు. మరి ఇప్పుడు ఇలా 'సై రా' కోసం చిరు లుక్ ని గట్రా కచ్చితంగా మార్చాలి అంటే..... ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లే అవకాశం లేదంటున్నారు. ఇకపోతే 'సై రా' సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ తో సహా నయనతార వంటి మేటి తారలు నటించనున్నారనే విషయం తెలిసిందే.