Advertisement
Google Ads BL

పవన్ తో సినిమా కోసం అంజనీ పుత్ర రెడీ!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దర్శకుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంటుంది. అసలు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని దృష్టిలో ఉంచుకునే చాలా మంది రైటర్ లు కథలు రాస్తుంటారు. అందులో కొంతమందికి పవన్ దొరికితే మరికొంతమందికి మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే అలా కథలు రాసుకున్న చాలా మంది రైటర్స్ లో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నాడట. 'గ‌మ్యం, వేదం, కృష్ణంవందే జ‌గద్గురుమ్‌, కంచె, గౌత‌మిపుత్ర‌ శాతకర్ణి' ఇలా దేనికదే  వైవిధ్య‌మైన సినిమాల‌తో ఇండస్ట్రీలో త‌న‌కంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్నాడు క్రిష్. ప్రస్తుతం క్రిష్ 'గౌతమీపుత్ర శాతకర్ణి' తర్వాత  బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Advertisement
CJ Advs

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రతో 'మణికర్ణిక' అనే చారిత్రాత్మక సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ తెలుగులో చేయ‌బోయే సినిమా కోసం ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు చేసేసుకొంటున్నాడట. అందులో భాగంగానే ప‌వ‌న్ కోసం ఆల్రెడీ ఒక కథని కూడా రెడీ చేశాడట క్రిష్. 'కంచె' కంటే ముందే ప‌వ‌న్‌తో సినిమా చేయ‌డానికి క్రిష్ చాలా ప్ర‌య‌త్నించాడని.... అయితే అప్పట్లో అది కార్య‌రూపం దాల్చలేదని తాజాగా ప్రచారం జరుగుతుంది.

కానీ ఈసారి మాత్రం ప‌వ‌న్‌ని త‌న క‌థ‌తో ఎలాగైనా మెప్పించాల్సిందేన‌ని గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడ‌ట‌ క్రిష్. మరి ఈసారి ఎలాగైనా పవన్ ని డైరెక్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు క్రిష్. మరి ఈ దర్శకుడు రెడీ చేసిన కథ పవన్ కి నచ్చుతుందో లేదో చూడాలి. ఇకపోతే క్రిష్ ఇదివరకు మహేష్ బాబు కోసం కూడా 'త్రయం' అనే స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని కూర్చున్న అది కూడా కార్య రూపం దాల్చలేదు. మరి ఇప్పుడు పవన్ సినిమా అయినా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

Director Krish Wants to Direct Pawan Kalyan:

Director Krish Waiting For Movie with Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs