Advertisement
Google Ads BL

ఎఫైర్ వార్తలపై నితిన్ క్లారిటీ ఇస్తాడా?


'లై' సినిమా విడుదలైనప్పటి నుండి హీరో నితిన్ కి ఆ సినిమాలో మొదటిసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మేఘ ఆకాష్ కి మధ్యన లవ్ ఎఫైర్ ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరిగింది. 'లై' సినిమాలో రొమాన్స్ పండించిన ఈ జంట నిజ జీవితంలో కూడా ఒక్కటి కాబోతుందనే టాక్ బాగా వినబడింది. అయితే ఈ విషయమై నితిన్ గాని, మేఘ ఆకాష్ గాని ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయేసరికి ఈ గాసిప్ అలా అలా పాకిపోయింది. అయితే కొన్నాళ్ల నుండి ఈ గాసిప్ వినబడడం లేదుగాని ఇప్పుడు మళ్ళీ కొత్తగా నితిన్ - మేఘ ఆకాష్ ల ప్రేమ.... పెళ్లివరకు వెళ్ళిందంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక నితిన్ - మేఘ పెళ్లి ప్రకటన త్వరలోనే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇవ్వబోతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. 'లై' సినిమా అప్పుడే ప్రేమలో ఉన్న ఈ జంట మరొక సినిమా కూడా జంటగా చేస్తున్నారు. త్రివిక్రమ్, పవన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నితిన్- మేఘ ఆకాష్ తో కలిసి నటిస్తున్నాడు. అయితే  వీరి మధ్యన ఉన్న ప్రేమ వలెనే నితిన్, మేఘకి మరొక అవకాశం ఇచ్చినట్లు... కాదు రెండో సినిమా పట్టాలెక్కిన తర్వాతే వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇంతలా వ్యాపిస్తున్న రూమర్స్ మీద నితిన్ మీడియాకి, అభిమానులకి, అందరికి ఒక క్లారిటీ ఇస్తే బావుంటుంది.

అసలు నిజంగానే నితిన్... మేఘ ఆకాష్ తో ఎఫైర్ సాగిస్తున్నాడా... నిజంగానే పెళ్లి  చేసుకుంటాడా అనేది క్లారిటీ లేకపోతె మాత్రం రోజుకో న్యూస్ ఈ జంట మీద సోషల్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియాలో ప్రచారం అవుతూనే ఉంటాయి.

Is Nithin in love with the young actress Megha Akash?:

Gossips on Nithiin and Megha Akash Releationship 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs