Advertisement
Google Ads BL

ఈ సినిమాలో ఏముందని అంత పెట్టారో?


‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నాగఅన్వేష్ ని హీరోగా పెట్టి ఆయన తండ్రి ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి.... ‘ఏంజెల్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ అన్వేష్ పక్కన హాట్ భామ హెబ్బా పటేల్ నటించింది.  అయితే ఈ సినిమా విడుదల అదిగో... ఇదిగో అంటున్నారు కానీ ఇంతవరకు.. సినిమా విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమాకి బిజినెస్ జరగని కారణంగా విడుదల చెయ్యడానికి జంకుతున్నారని టాక్.

Advertisement
CJ Advs

అయితే 'ఏంజెల్' ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాని చిరంజీవి -శ్రీదేవి జంటగా వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలా... ఉందన్నారు. ఆ ట్రైలర్ తో కాస్త అంచనాలు పెంచారు గాని ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి దాదాపుగా 25 కోట్ల బడ్జెట్ నాగ్ అన్వేష్ తండ్రి పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి.  సినిమా విడుదల సంగతి ఎలాగున్నా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 25 కోట్ల మీద ఫిలిం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది.  అసలు ఏం చూసి ఈ సినిమాకి అంత ఖర్చు పెట్టారంటున్నారు.

నాగ అన్వేష్ గత చిత్రం చూస్తే అట్టర్ ప్లాప్. ఇంకోపక్క టాలీవుడ్ హాట్ భామ హెబ్బా పటేల్ ఈ సినిమాలో నటిస్తుంది... అందుకే ఈ బడ్జెట్ అనుకోవడానికి లేదు. కేవలం హీరోయిన్ మీద 25 కోట్ల బడ్జెట్ పెట్టరు. మరి ఏం చూసి ఈ బడ్జెట్ పెట్టారు అంటే... గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొంచెం ఖర్చు పెట్టినట్లుగా చెబుతున్నారు. మరి 25 కోట్ల బడ్జెట్ సినిమా కనీసం 30 కోట్ల బిజినెస్ జరక్కపోతే నిర్మాతకు భారీ లాస్ వచ్చేస్తుంది. మరి తెలుగులోనే బిజినెస్ లేక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే.. ఈ సినిమాని తమిళం, హిందీలో కూడా విడుదల చేస్తామని చెప్పడం చూస్తుంటే మాత్రం విచిత్రంగా కనబడుతుంది.

Angel Budget Limits Crossed:

Naga Anvesh and Hebah Patel Movie Angel Budget Reached 25 Crores
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs