Advertisement

ఈ సంవత్సరం కాదంటూనే వర్మ బాంబ్ పేల్చాడు!


రాజకీయనాయకులకు తమ ప్రత్యర్ధులను టార్గెట్‌ చేయడం ఎలాగో వర్మని చూసినేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు వర్మ రిప్లై ఇస్తూ.. నిజమే.. ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు చూడరు. అందుకే నేను దానిని వక్రీకరించకుండా జరిగిన విషయాలన్నింటినీ చూపించబోతున్నాను. ఇక చంద్రబాబు గారు చెప్పినట్లు ఎన్టీఆర్‌ జీవితం తెరిచిన పుస్తకమే. కానీ దానిలో చినిగిపోయిన లేదా చింపేసిన పేజీలను నేనుతిరిగి అంటించబోతున్నానని కౌంటర్‌ ఇచ్చాడు. 

Advertisement

ఇప్పటివరకు తెలుగుదేశం నాయకులు వర్మని విమర్శిస్తే ఆయన అందరికీ కౌంటర్లు ఇచ్చాడు. వాటికి ఎవ్వరూ సరైన రిప్లై కూడా ఇవ్వలేకపోయారు. మరి చంద్రబాబు అయినా ఇస్తాడో లేదో...! ఇక తాజాగా వర్మ చేసిన పోస్ట్‌ సంచలనం సృష్టించింది. 'ఈ దీపావళిని వదిలేయండి..వచ్చే దీపావళికి మాత్రం ఎన్టీఆర్స్‌ లక్ష్మీబాంబ్‌లు చాలా పేలనున్నాయి. ఎన్టీఆర్‌ ఆత్మ అంటించే బోలెడు బాంబ్‌లు పేలనున్నాయని చెప్పాడు'.. అంటే వర్మ తీసే చిత్రం ఖచ్చితంగా వివాదాస్పద చిత్రమేననితెలుస్తోంది. 

ఇక చంద్రబాబు సూచనమేరకు తెలుగుదేశం పార్టీ వారు మౌనం వహించిన నేపధ్యంలో వారిని మరలా ఎలాగైనా రెచ్చగొట్టాలనే వర్మ ఇలా కామెంట్స్‌ చేస్తున్నాడని, వర్మ వంటి వ్యక్తి సినిమాలలో కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్‌లలో ప్రతిపక్షనేతగా ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. నిజమే.. సమస్యను వదిలిపెట్టి తనను సీఎంని చేయమని చెప్పి ప్రతిపక్షనేతగా విఫలమవుతున్న జగన్‌ కంటే వర్మనే విపక్షనాయకుడిగా కరెక్ట్‌ అని చెప్పాలి. 

Varma's Lakshmi Bomb on TDP :

Varma' Sensational Post and Deepavali and Lakshmi's NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement