ఒకప్పుడు సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల చుట్టూ హీరోయిన్స్ తిరిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ హీరోస్.... హీరోయిన్స్ చుట్టూ తిరగాల్సివస్తుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ సీనియర్ హీరోస్ తో నటించటానికి ఇష్టపడట్లేదు. 'గురు' సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకుని మళ్ళీ తేజ దర్శకత్వంలో నటించపోతున్నాడు వెంకటేష్.
తేజ డైరెక్షన్ లో నటించబోతున్న వెంకటేష్ కి హీరోయిన్స్ ని వెతికే పనిలో పడింది టీమ్. వెంకటేష్ సీనియర్ నటుడు కాబట్టి ఏ హీరోయిన్ యాక్ట్ చేయటానికి ఇష్టపడట్లేదు. 'బాబు బంగారం'లో నయనతార నటించినప్పటికీ.. మళ్లీ రిపీట్ చేసే పొజిషన్ లో వెంకీ లేడు.
అయితే ఇప్పుడు తాజాగా 'మహానుభావుడు, రాజా ది గ్రేట్' తో వరుస విజయాలను సొంతం చేసుకున్న... బొద్దు భామ మెహ్రీన్.... వెంకీ లాంటి సీనియర్ సరసన సరిగ్గా సరిపోతుంది అని భావిస్తున్నారు. అందుకే మెహ్రీన్ తో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చిత్రాన్నీసురేష్ బాబు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించబోతున్నారు. డైరెక్టర్ తేజ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కన్నా ముందే ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. నవంబర్ రెండో వారంలో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే తేజ దర్శకత్వంలో వెంకీ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయమై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు.