Advertisement
Google Ads BL

ఆయన ఎప్పుడడిగితే అప్పుడు నేను రెడీ: టబు!


తెలుగులో నాగార్జున అంటే 'నిన్నేపెళ్లాడతా' నుంచి టబుకి ఎంతో గౌరవం. నాటి నటి ఫరా సోదరి అయిన ఈ హైదరాబాదీ బాలీవుడ్‌లో ఎంతో ఫేమస్‌ అయినా కూడా హైదరాబాద్‌ వచ్చినప్పుడు నాగ్‌ ఇంట్లోనే దిగుతుంది. ఇక దీంతో ఆమెకి నాగ్‌కి లింకులు పెట్టేశారు చాలా మంది. కానీ టబు ప్రేమించింది, వివాహం చేసుకోవాలని భావించింది బాలీవుడ్‌స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ని. ఆమద్య తనకు తగ్గ వరుడిని చూసిపెట్టాలని ఆమె మీడియా సమక్షంలోనే కోరి సంచలనం సృష్టించింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె ఇప్పటికే అజయ్‌దేవగణ్‌తో 'విజయ్‌పథ్‌, తక్షక్‌, దృశ్యం' వంటి చిత్రాలలో నటించింది. తాజాగా ఆమె తన పాత ప్రియుడితో 'గోల్‌మాల్‌ ఎగైన్‌' చిత్రంలో నటిస్తోంది. తాను అజయ్‌దేవగణ్‌ చిత్రాలలో అవకాశం వస్తే వదలనని, ఆయనహీరోగా నటించే చిత్రాలలోనే కాదు.. ఆయన దర్శకత్వం, నిర్మాతగా చేసే చిత్రాలలోకూడా తనను అడిగితే నటిస్తానని తేల్చేసింది. అజయ్‌ తాను చిన్ననాటి స్నేహితులమని, ఆయన చిత్రంలో నాకు పాత్ర ఉంటే ఖచ్చితంగా చేస్తాను గానీ వదలనని మరోసారి స్పష్టం చేసింది. 

ఇక 'గోల్‌మాల్‌ ఎగైన్‌' చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తుండగా, ఈ శుక్రవారం విడుదల కానుంది. దీని తర్వాత 'లవ్‌ రంజన్‌' నిర్మాతగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్‌ చిత్రంలో కూడా అజయ్‌తో కలిసి నటించనున్నానని తెలిపింది. ఇక ప్రస్తుతం ఆమె నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌, విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అఖిల్‌కి తల్లి పాత్రను పోషిస్తోందని అంటున్నారు.ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న విడుదల కానుంది. 

Tabu Talks About Ajay Devgan:

Again Actress Tabu Love Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs