Advertisement
Google Ads BL

రంగస్థలంపై కన్ఫ్యూజ్ కాదు క్లారిటీ ఇవ్వండి!


వచ్చే సంక్రాంతికి ఏ సినిమా బరిలోకి దిగుతుందో... ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో అనేది క్లారిటీ రావడం లేదు. పవన్ - త్రివిక్రమ్ సినిమా మాత్రమే జనవరి 10న బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇక రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం మాత్రం సంక్రాంతికి విడుదలన్నారు గాని ఎటువంటి డేట్ లాక్ చేసుకోలేదు. మరో పక్క బాలకృష్ణ - కెఎస్ రవికుమార్ ల సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ మొదలుపెట్టుకుని చాలా రోజులు కావొస్తున్నా ఈ సినిమా ఫస్ట్ లుక్ గాని, విడుదల తేదీ గాని ప్రకటించలేదు.

Advertisement
CJ Advs

షూటింగ్ మొదలైనప్పుడు దసరా రిలీజ్ అన్నవాళ్ళు.. తర్వాత సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ అది ఇప్పుడు కుదిరేలా కనబడటం లేదు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ కి మధ్యలో గ్యాప్ రావడం... అలాగే సంక్రాంతి బరిలో పవన్ - త్రివిక్రమ్ ల సినిమా ఉండడంతో ఈ సినిమా వచ్చే ఏడాది మార్చికి వెళ్లే సూచనలు  కనబడుతున్నాయి అంటున్నారు. పవన్ సినిమా పక్కా... చరణ్ సినిమా డౌట్ అనే సంకేతాలు అందుతున్నాయి. అసలు చరణ్ - సుకుమార్ లు తమ రంగస్థలం విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారనే టాక్ కూడా వినబడుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రం మార్చికి వెళ్లిపోయిందంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు సంక్రాంతికి సర్దుకుని.... ఏప్రిల్ కి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా సంక్రాంతి బరిలో నుండి మార్చికి వెళ్ళిపోయినట్లే అంటున్నారు. మరి ఇలా సినిమా విడుదల లేట్ అవడానికి షూటింగ్ లేటా లేకుంటే మరేదన్న కారణమా అనేది మాత్రం తెలియడం లేదు. ఇక రామ్ చరణ్ రంగస్థలం పూర్తి కాగానే బోయపాటి శ్రీను సినిమాకి కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

No Clarity to Rangasthalam Release Date:

Sukumar, Ram Charan's Confusion on Rangasthalam 1985 Release Date 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs