Advertisement
Google Ads BL

చలపతిరావు నోరు జారలేదు.. జరిగేదేగా అంది!


నటుడు చలపతిరావుది 50ఏళ్లకు పైగా ఇండస్ట్రీ అనుభవం. ఆయన అందరితో చాలా సరదాగా ఉంటారు. తోటి నటీనటులు, ముఖ్యంగా మహిళా నటీమణులు కూడా ఆయనను ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తారు. ఎవరైనా నటీమణులు ఆయన కాళ్లకు నమస్కారం చేయడం, లేదా ఏదైనా సందర్భంలో సారీ చెబితే నా కూతురిలాంటి దానివి. నువ్వు నాకు సారీ ఏంటమ్మా చెప్పేది అని దీవిస్తారు. ఆయన్ను ఎరిగిన వారందరూ ఆయన్ను బాబాయ్‌ అనే అంటారు. ఇక ఆయన మోటు సామెతలు వేసే సంగతి కూడా నిజమే. కానీ పైకి పెద్దల్లా కనిపించి, తర్వాత నటీమణులను లైంగిక వేధింపులు చేయడం ఆయనకు తెలియదు. కానీ ఆయన 'రారండోయ్‌ వేడుకచూద్దాం' ఫంక్షన్‌లో ఆడాళ్లు పక్కలోకి పనికి వస్తారని చేసిన కామెంట్స్‌ చూసి చీకటి వ్యవహారాలు చేసే వారు కూడా తామేదో పతివ్రతలమన్నట్లు చలపతిరావుపై మాటల తూటాలు పేల్చారు. 

Advertisement
CJ Advs

చివరకు ఈ కామెంట్స్‌ చూసిన ఆయన తనది తప్పేనని నమస్కారం చేస్తూ ఏడ్చేశాడు. ఈ గొడవ వినలేక ఆయన కుమారుడు దర్శకుడు రవిబాబు ఆయన.. 'మదపిచ్చి మీద మాట్లాడుతున్నాడు. ఈ వయసులో ఆయనను మాటలతో తప్పు చేసిన వాడిగా వెలివేయవద్దు.. కావాలంటే నడిరోడ్డులో ఉరితీయండి' అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక కొందరు బాబాయ్‌ సన్నిహితులు.. 'బాలకృష్ణ' 'ఆడాళ్లకు కడుపు చేయమంటే మాట్లాడని పెద్దలు పెద్దగా పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి లేదని చలపతిరావుని విమర్శించడం ఎంత వరకు సమంజసం'? అని అన్నారు. అందులో కూడా నిజం ఉంది. ఇక నాటి స్వర్గీయ రామారావు పది కిలోమీటర్ల వరకు దరిదాపుల్లోకి కూడా బాలయ్య, జూనియర్‌లు రాలేదని చేసిన వ్యాఖ్య కూడా వాస్తవమే అయినా అంగీకరించే విశాల హృదయం మనకు లేదు. ఇక ఆయన కొద్దిరోజుల కిందట.. ఆడాళ్లు చీరలు కట్టడం మానేశారు. లంగాఓణి ఇస్తే ఓణిని తలకు చుట్టుకుంటూ, జీన్జ్‌, షార్ట్స్‌ వెంట పడుతున్నారు.. అలా కనిపించినప్పుడు మగాళ్లు సహజంగానే కామెంట్‌ చేస్తారు. పడితే కామెంట్స్‌ని భరించండి.. లేదా మగాళ్లకు ఎదురు తిరగండి అని ఆయన చేసిన మంచి వ్యాఖ్యలు కూడా వివాదం పులుముకున్నాయి. 

తాజాగా 'పీఎస్వీ గరుడవేగ' ఫంక్షన్‌లో 'రాజశేఖర్‌ ప్రవీణ్‌సత్తార్‌ తన చేత చేయించిన యాక్షన్‌ సీన్స్‌ వల్ల మోకాలి చిప్పలు అరిగిపోయాయని అంటున్నాడు. ఆయనకు ఎప్పుడో డ్యాన్స్‌లు చేసి చేసి మోకాలి చిప్పలు అరిగిపోయాయి. ఇప్పుడు కూడా మోకాలి చిప్పలు అరిగిపోతే ఎలా'.. దానితో ఎంతో పనుంటుందని చెప్పి, ఇది సింగిల్‌ మీనింగేనన్నాడు. దీనిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మంచి వయసులో ఉండగానే తన భార్య చనిపోతే తన పిల్లల కోసం మరోపెళ్లి చేసుకోని ఆయనను విమర్శించేహక్కు ఎవరికి ఉంటుంది? ఆయన రియల్‌స్టోరీనే 'మా నాన్నకు పెళ్లి' గా ఈవీవీ తీశాడు. అది చూడండి...! 

Chalapathi Rao Controversial Comments at PSV Garuda Vega Event:

Chalapati Rao Reaction on Rajasekhar Dialogue at PSV Garuda Vega Trailer Launch Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs