Advertisement
Google Ads BL

బయోపిక్‌పై తేజ అతిగా ఆశిస్తున్నాడా?


దర్శకుడు తేజ డైరెక్షన్‌లో బాలయ్య వెర్షన్ ఎన్టీఆర్‌ బయోపిక్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఇది తేజకి లభించిన అనుకోని అవకాశం. ఇక నందమూరి కుటుంబానికి చెందిన నటులు ఈ చిత్రంలో చిన్న పాత్రయినా చేయాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే బాలయ్య, ఆయన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఇందులో నటించడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ చేస్తుంటే.. ఎన్టీఆర్‌ చిన్ననాటి పాత్రను మోక్షజ్ఞ పోషిస్తాడా? లేక బాలయ్య పాత్రను పోషిస్తాడా? అనేది తెలియాల్సివుంది.

Advertisement
CJ Advs

మరోపక్క ఈ చిత్రాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపొందించాలనే యోచనలో బాలయ్య ఉన్నాడు. మరి ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌కి కూడా ఏదైన పాత్ర ఇస్తే ఇది అక్కినేని ఫ్యామిలీకి 'మనం'లా, నందమూరి ఫ్యామిలీ చిత్రంగా ఇది ఉంటుంది. అందునా జూనియర్‌ నటిస్తే ఈ చిత్రం రేంజ్‌ మరో స్థాయికి వెళ్తుంది. దీంతో తాజాగా జూనియర్‌ని కలిసి ఆయనను ఓ పాత్ర చేయమని కోరడానికి తేజ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇది నిజమో కాదో తెలియదు గానీ బాలయ్య ప్రస్తుతం లోకేష్‌ని మోస్తూ జూనియర్‌ అంటే ఇప్పటికీ మండిపడుతున్నాడట. ఆయన దాదాపు జూనియర్‌, కళ్యాణ్‌రామ్‌, హరికృష్ణలతో తెగతెంపులు చేసుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. 

త్వరలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటం, అల్లుడు లోకేష్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడంతో బాలయ్య ఎన్టీఆర్‌ని నందమూరి వారసునిగా పరిగణించడం లేదని, తన కుమారుడు మోక్షజ్ఞ సినిమాలలో నందమూరి వారసుడని, రాజకీయాలలో నారా లోకేష్‌ని తమ వారసునిగా బాలయ్య భావిస్తుండటమే దీనికి కారణం. అదే బాలయ్య ఓకే అంటే మాత్రం జూనియర్‌ ఎంతో సంతోషంగా ఒప్పుకుంటాడు. మరి 'మహానటి'లో ఎన్టీఆర్‌ పాత్రను చేయనని చెప్పిన ఎన్టీఆర్‌ వద్దకు బాలయ్య అనుమతి లేకుండా ఆయనను పాత్ర పోషించమని అడగటం దుస్సాధ్యమేనని చెప్పాలి. జూనియర్‌ ఓకే అన్నా కూడా బాలయ్య అందుకు ఒప్పుకోడనే వార్తలే నిజమనిపిస్తోంంది.

Director Teja Over Expectations On NTR Biopic:

Teja Directs Balakrishna Version's NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs