బొద్దుగుమ్మ నమిత తెలియని వారుండరు. తెలుగులో ఆమె పలువురు స్టార్స్‌తోనే కాదు కుర్రహీరోలతో కూడా నటించింది. కానీ ఉన్నట్లుండి ఈమె బొద్దుగా మారిపోయింది. దాంతో తమిళనాడు ప్రేక్షకులు బొద్దందాలకు బాగా పడిపోతారు కాబట్టి అక్కడ ఆమెను దేవతలా చూసుకున్నారు. గుడులు కట్టే క్రేజ్‌ని ఆమె సొంతం చేసుకుంది. ఇక ఆమె బొమ్మ కనిపిస్తే చాలు తమిళతంబీలు థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. కాగా ఈ భామ ఇటీవలే కాస్త ఒళ్లు తగ్గించింది. పూర్తిగా కాకపోయినా కాస్తైనా వెయిట్ లాస్ అయింది.
ఇక కోలీవుడ్ మీడియాలో తాజాగా ఈమె దక్షిణాది నటుడు, ముఖ్యంగా తెలుగువాడైన శరత్‌బాబుతో సహజీవనం చేస్తోందని, త్వరలో ఇద్దరు ఒకటయి పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు వ్యాపించింది. దానిపై శరత్‌బాబు ఇప్పటికే ఖండన ఇచ్చాడు. ఆమెతో ఏదో ఎనిమిదేళ్ల కిందట ఓచిత్రంలో నటించానని, పెళ్లి చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటానని మీడియాకు తెలిపాడు. అయినా 60ఏళ్ల పైబడ్డ శరత్‌బాబుతో నమతకి ఎవరు లింక్ పెట్టారో గానీ ఈ వార్తలతో గతకొంతకాలంగా సినిమాలలో నటించని నమిత మరోసారి వార్తల్లో నిలుచోంది. ఈసారి ఈ వార్తలను నమిత ఖండించింది.
అసలు తమిళ మీడియా ఇలాంటి పుకార్లను ఎందుకు పుట్టిస్తుందో అర్ధం కావడం లేదని, తనకు శరత్‌బాబు ఎవరో కూడా తెలియదంటోంది. పుకార్ల వరకు ఖండిస్తే బాగానే ఉంటుంది గానీ శరత్‌బాబు అంటే ఎవరో కూడా తెలియదని చెప్పడం ఆమె అబద్దం చెబుతోందనే హింట్‌ని అందిస్తోంది.ఇక ఈమె బాలకృష్ణ సరసన 'సింహా'లో నటించిన తర్వాత మరలా తెలుగులో కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం ఇకపై ఆమె అమ్మ జయలలితనే స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టడానికి భారీ ప్రణాళికలు రచిస్తోంది...!