బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యాడు ప్రభాస్. అందరి చూపు ప్రభాస్ మీదే. ఎవరిని కదిపినా బాహుబలి ప్రభాస్ గురించిన ముచ్చట్లే. బాహుబలితో ప్రభాస్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క అభిమానుల సంఖ్యే కాదు..... ప్రభాస్ తో కలిసి నటించాలని కూడా టాలీవుడ్ హీరోయిన్స్ దగ్గరనుండి బాలీవుడ్ హీరోయిన్స్ వరకు ఎగబడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ లో చాలామంది ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందని... అవకాశం వస్తే వదులుకోమనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఆ రేంజ్ లో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆరడుగుల ఆజానుబాహుడు, అందగాడు.. అలాంటి వాడితో నటించాలనేమిటి.... ప్రభాస్ ని పెళ్లి చేసుకోవాలని కూడా చాలామంది కలలుగంటున్నారు. ప్రభాస్ కి మూడు పదులు దాటినా ఇప్పటివరకు ప్రభాస్ బ్యాచులర్ గా ఉన్నాడు. బాహుబలి తర్వాత పెళ్లి అని ప్రచారం జరిగినా ప్రస్తుతానికి ప్రభాస్ మాత్రం పెళ్లి విషయంలో ఉలుకు పలుకు లేకుండానే ఉన్నాడు.
ఇక ప్రభాస్ తో కలిసి నటించడానికి చాలామంది హీరోయిన్స్ లైన్ లో ఉన్నారు. అవకాశం రావాలే కానీ అల్లుకుపోవాలనుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఒక హీరోగారి కూతురు ప్రభాస్ తో ఒక్క సినిమాలో నటించాలని ఆశపడుతోంది. ఆమె ఎవరో కాదు.. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. తమిళంలో హీరోయిన్ గా నటిస్తున్న వరలక్ష్మి అక్కడ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా ఆమె ప్రభాస్ మీద చేసిన కామెంట్స్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యి కూర్చున్నాయి. తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరలక్ష్మిని మీకు తెలుగులో ఏ హీరోతో నటించాలనుందని అడగగా... వెంటనే ప్రభాస్ అని సమాధానం చెప్పింది. బాహుబలిలో ప్రభాస్ నటన అద్భుతం అని.. ఆ సినిమాతో తాను ప్రభాస్ కి వీరాభిమానిగా మారిపోయానని... ప్రభాస్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.
మరి వరలక్ష్మి కోరికను ప్రభాస్ ఎప్పటికి తీరుస్తాడో చూద్దాం.